Home న్యూస్ 10వ రోజు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ ను క్రియేట్ చేసిన స్త్రీ2!!

10వ రోజు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ ను క్రియేట్ చేసిన స్త్రీ2!!

0

బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ వసూళ్ళని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మొదటి వారంలో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాతే రెండో వీక్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…

సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 10వరోజు రెండో వీక్ శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపించింది…బాలీవుడ్ లో ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ లో రెండో వీక్ శనివారంలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….

రెండో శనివారం సినిమా కి మొత్తం మీద ఇండియాలో ఏకంగా 33.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు బాలీవుడ్ మూవీస్ పరంగా రెండో శనివారంలో యానిమల్ మూవీ 32.47 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

అంతకన్నా ముందు గదర్2 31 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని, జవాన్ 30 కోట్ల కి పైగా నెట్ కలెక్షన్స్ ని రెండో శనివారం అందుకోగా ఇప్పుడు స్త్రీ2 మూవీ అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి రెండో శనివారం ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా ఓవరాల్ గా…

10 రోజుల్లో ఇండియాలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Stree2 HUMONGOUS Collections
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
Total Collections – 360.90CR NET💥💥💥💥

మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న స్త్రీ2 సినిమా ఇక ఈ రోజు సండే అడ్వాంటేజ్ తో అలాగే రేపు కృష్ణాష్టమి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లు లభించడంతో లాంగ్ రన్ లో బాలీవుడ్ లో ఇప్పుడు మరో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ తో పాటు కొత్త రికార్డులను కూడా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here