Home న్యూస్ ఇది కదా ట్రైలర్ అంటే…..బాలీవుడ్ కి బిగ్ బ్లాక్ బస్టర్ ఖాయం!

ఇది కదా ట్రైలర్ అంటే…..బాలీవుడ్ కి బిగ్ బ్లాక్ బస్టర్ ఖాయం!

0

ఈ ఇయర్ బాలీవుడ్ నుండి సరైన బిగ్ బ్లాక్ బస్టర్ లు రాలేదు…కొన్ని సినిమాలు మంచి రిజల్ట్ లను సొంతం చేసుకున్నా కూడా ఓ బిగ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు బాలీవుడ్ కరువు తీర్చడానికి ఓ బ్లాక్ బస్టర్ మూవీ రాబోతుంది…2018 టైంలో బాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన స్త్రీ అనే సినిమా ఊహకందని విజయాన్ని నమోదు చేసింది.

ఇండియాలో ఏకంగా 129 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 180 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా విజయం తర్వాత స్త్రీ యూనివర్స్ లో భాగంగా ఇతర సినిమాలు కూడా వచ్చాయి…కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన…

స్త్రీ సినిమాకి సీక్వెల్ గా స్త్రీ2 మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ ఆగస్టు 15న రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా బాలీవుడ్ కి ఓ భారీ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి..

స్త్రీ మొదటి పార్ట్ లో ఊరి జనాల నుండి రెస్పెక్ట్ కోరుకునే ఒక ఆత్మ కథతో తెరకెక్కగా రెండో పార్ట్ లో స్త్రీని చంపేసిన సర్ కటే అనే వ్యక్తి ఆత్మ ఆ ఊరిని పట్టి పీడిస్తున్న తరుణంలో స్త్రీ తిరిగి వచ్చి ఏం చేసింది అన్న కాన్సెప్ట్ తో ఈ సీక్వెల్ ఉండబోతుంది అని ట్రైలర్ లో చూపించారు…

హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా డైలాగ్స్ అండ్ కామెడీ పరంగా ట్రైలర్ కుమ్మేసింది…రీసెంట్ టైంలో వచ్చిన బాలీవుడ్ ట్రైలర్స్ లో బెస్ట్ కట్ ఈ ట్రైలర్ అనే చెప్పే రేంజ్ లో మెప్పించిన ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెరిగేలా చేసింది అని చెప్పాలి.

ట్రైలర్ ఏ రేంజ్ లో మెప్పించిందో సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కి భారీ బ్లాక్ బస్టర్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సినిమా మినిమమ్ 200 కోట్లు ఆ పైన వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here