Home న్యూస్ ఇవేం బుకింగ్స్ రా బాబు…చరిత్రకెక్కడం ఖాయం ఇక!!

ఇవేం బుకింగ్స్ రా బాబు…చరిత్రకెక్కడం ఖాయం ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కి ఈ ఇయర్ పెద్దగా కలిసి రాలేదు, కొన్ని సక్సెస్ లు వచ్చినా కూడా అనుకున్న రేంజ్ లో బిగ్ మూవీస్ జోరు చూపించే విషయంలో పూర్తిగా వెనకబడిపోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15 వీకెండ్ లో క్రేజీ మూవీ సీక్వెల్ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది….ఆ సినిమానే స్త్రీ2(Stree2 Movie)…..

శ్రద్దా కపూర్(Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్త్రీ యూనివర్స్ క్రియేట్ అవ్వగా అందులో భాగంగా వచ్చిన ఇతర సినిమాలు మంచి రిజల్ట్ లు సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ యూనివర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన..

స్త్రీ2 మూవీ ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ ట్రైలర్ క్లిక్ అవ్వడం, సాంగ్స్ మంచి రచ్చ చేయడంతో సినిమా మీద ఆడియన్స్ లో క్రేజ్ సాలిడ్ గా పెరిగి పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో..

దూసుకు పోతున్న స్త్రీ2 మూవీ బుకింగ్స్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ 3.5 కోట్లు దాటగా సినిమాకి…

ఆగస్టు 14 న నైట్ షోలకు స్పెషల్ ప్రీమియర్స్ పడనుండగా 15న రెగ్యులర్ షోలు పడబోతూ ఉండగా ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సినిమా కి అవలీలగా 25-30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు…

బాలీవుడ్ చరిత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను స్త్రీ2 మూవీ ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమాకి టాక్ పాజిటివ్ గా వచ్చి పోటిలో ఉన్న ఇతర సినిమాల టాక్ కొంచం మిక్సుడ్ గా వచ్చినా అంచనాలను మించే కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here