Home గాసిప్స్ ట్రైలర్ వీరంగం సృష్టించింది…సినిమా బడ్జెట్ అంచనాలు మించింది!

ట్రైలర్ వీరంగం సృష్టించింది…సినిమా బడ్జెట్ అంచనాలు మించింది!

0
Shraddha Kapoor Stree2 Movie Budget Details
Shraddha Kapoor Stree2 Movie Budget Details

బాలీవుడ్ లో చిన్న సినిమాల్లో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్న స్త్రీ సిరీస్ ను మొదలు పెట్టిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు స్త్రీ2(Stree2 Movie) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 15న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ట్రైలర్ హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఆన్ కామెడీ సీన్స్ తో నిండిపోయిన స్త్రీ2 ట్రైలర్ సాలిడ్ గా ఆడియన్స్ ను మెప్పించింది. శ్రద్దా కపూర్(Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమా పేరుకు ఇతర స్టార్ కాస్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ గానే వస్తూ ఉండగా….

మొదటి పార్ట్ 180 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా స్త్రీ యూనివర్స్ కూడా సూపర్ సక్సెస్ ఫుల్ గా నిలవడంతో స్త్రీ యూనివర్స్ కి స్త్రీ2 కీలకంగా మారగా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారని తెలుస్తుంది. మొదటి పార్ట్ ఇండియాలో 129 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

రెండో పార్ట్ కోసం ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టి నిర్మించారని తెలుస్తుంది. ఈ రేంజ్ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ కి పెట్టడం అంటే మామూలు విషయం కాదు కానీ సినిమా హైప్ కి తగ్గ రేంజ్ లోనే బడ్జెట్ ఉందని చెప్పాలి ఇప్పుడు… మొదటి పార్ట్ కి అప్పట్లో 45 కోట్ల రేంజ్ లోనే…

బడ్జెట్ పెట్టగా ఊహకందని విజయాన్ని ఆ సినిమా అందుకోగా ఇప్పుడు పార్ట్ కి 110 కోట్ల రేంజ్ బడ్జెట్ పెట్టడం, ట్రైలర్ కి యునానిమస్ రెస్పాన్స్ తో పాటు వీరంగం సృష్టించే రేంజ్ లో రీచ్ సొంతం అవ్వడంతో మొదటి పార్ట్ రేంజ్ లో టాక్ కనుక సొంతం అయితే…

రెండో పార్ట్ ఆగస్టు 15th లాంగ్ వీకెండ్ లో ఊహకందని వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మినిమమ్ 300 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే కెపాసిటీ ఈ సినిమాకి ఉందని అంచనా వేస్తూ ఉండటంతో సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here