బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ ఒకటి కాగా…సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా….
అనుకున్న దాని కన్నా బెటర్ ట్రెండ్ ను చూపించి వీకెండ్ లో మంచి జోరుని చూపించగా వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతుంది. ఓవరాల్ గా సినిమా చిన్న సినిమా అనుకున్నారు కానీ సమంత ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా…
మంచి బడ్జెట్ తో నిర్మించరని సమాచారం…ఓవరాల్ గా సినిమాను ప్రమోషన్స్ తో కలిపి 5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మించగా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ కింద సుమారు 1.50 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా…
అన్ని భాషల డిజిటల్ రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ కింద సుమారు 3.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని సమచారం…దాంతో ఆల్ మోస్ట్ పెట్టిన బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2.8 కోట్ల వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో 2.45 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ గా నిలిచే అవకాశం ఉండగా నిర్మాతగా సమంతకి థియేట్రికల్ రన్ తో కలిపి డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.