ఈ ఇయర్ సమ్మర్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమానే అయినా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం…
లాంగ్ రన్ లో మంచి జోరుని చూపించి మంచి సక్సెస్ గా నిలిచింది…డీసెంట్ 2 వీక్స్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా నిర్మాతగా సమంతకి మంచి సక్సెస్ ను అందించింది. బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది.
జియో హాట్ స్టార్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇక్కడ నుండి సినిమాకి ఎలాంటి టాక్ ఇప్పుడు సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ కూడా సినిమా మంచి టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది…
ఊర్లో అందరి ఇళ్ళలో రాత్రి 9 గంటలకు ఇంట్లో చనిపోయిన ముసలివాళ్ళ ఆత్మలు హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ శరీరంలోకి వచ్చి సీరియల్ చూసి వెళుతూ ఉంటాయి…ఈ విషయం తెలుసుకున్న హీరో అండ్ ఫ్రెండ్స్ ఏం చేసి ఈ ఆత్మల నుండి విముక్తిని సొంతం చేసుకున్నారు…
వీళ్ళకి మంత్రగత్తె అయిన సమంత ఎలా హెల్ప్ చేసింది అన్నది కథ పాయింట్ కాగా రొటీన్ గానే సాగిన సినిమా ఆసక్తి కలిగించే సన్నివేశాలతో లైట్ హార్టెడ్ కామెడీ సీన్స్ తో ఫస్టాఫ్ మంచి టైం పాస్ కాగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంటర్ టైన్ మెంట్…
చాలా చోట్ల వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి చిన్న సినిమానే అయినా కూడా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని సోషల్ మీడియాలో ఆడియన్స్ చెబుతున్నారు…రొటీన్ కథనే అయినా కూడా పెద్దగా బోర్ ఏమి లేకుండా సినిమా…
మంచి ఫ్లోతోనే సాగిందని చెబుతూ ఓవరాల్ గా డీసెంట్ టైం పాస్ మూవీ అని అంటున్నారు. డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ తో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఇక్కడ కూడా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.