Home న్యూస్ శుభం మూవీ టాక్ ఏంటి…ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!!

శుభం మూవీ టాక్ ఏంటి…ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!!

0

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది..సినిమా ప్రోమోలు ఆసక్తిని పెంచగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చాక పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకుంది ఇప్పుడు.

కథ పాయింట్ విషయానికి వస్తే కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన హీరోకి హీరోయిన్ తో పెళ్లి అవుతుంది…ఫస్ట్ నైట్ రోజు అనుకోకుండా ఒక టీవీ పెట్టగా ఒక సీరియల్ కి హీరోయిన్ బానిసగా మారిందని తెలుస్తుంది. తర్వాత ఇదే పరిస్థితి ఊర్లో ఆడవాల్లందరికీ జరిగింది అని తెలిసిన తర్వాత…ఏమయింది అన్నది కథ పాయింట్..

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలో అందరు యాక్టర్స్ కూడా కొత్తవాళ్ళే అయినా కూడా బాగా నటించి మెప్పించారు. సమంత చేసిన చిన్న రోల్ లో కూడా అదరగొట్టేసింది. ఇక సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ చాలా చోట్ల వర్కౌట్ అవ్వగా కథ పాయింట్ ని మరీ సాగదీసినట్లు అనిపించడం లాంటివి…

చిన్న మైనస్ అయినా కూడా డీసెంట్ ఎంటర్ టైనర్ గా అనిపించింది సినిమా…. మరీ కామెడీ విరగబడి నవ్వేలా లేక పోయినా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి కొద్ది వరకు నవ్వించి మెప్పించింది అని చెప్పొచ్చు సినిమా ని…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 80 వేల రేంజ్ లో డాలర్స్ ను వసూల్ చేసిన సినిమా మొదటి రోజున ఇండియా లో 10 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున ఆల్ మోస్ట్ 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా…

వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1.4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుందని అంచనా… ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ లో కామెడీ మూవీ లవర్స్ సపోర్ట్ తో డీసెంట్ రెవెన్యూని జనరేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here