మాస్ మహారాజ్ రవితేజ వరుస పరాయాలకి రీసెంట్ గా క్రాక్ సినిమా తో బ్రేక్ వేసి సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలి సిందే. క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి 50% లిమిటేషన్స్ తోనే ఏకంగా రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 కలెక్షన్స్ ని సొంతం చేసు కుని దుమ్ము లేపే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
ఇక ఈ విజయం తర్వాత రవితేజ చేస్తున్న కొత్త సినిమాలు ఒక్కోటి ఒక్క రకమైన జానర్స్ కి సంభందించి ఉండగా ఖిలాడీ తర్వాత కొత్త డైరెక్టర్ తో ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీ తర్వాత త్రినాధరావ్ నక్కిన డైరెక్షన్ లో కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్న రవితేజ…
వీటి తర్వాత బోయపాటితో సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉండగా వీటితో పాటు ఇప్పుడు సడెన్ గా ఒక రీమేక్ కూడా లిస్టులో చేరే అవకాశం ఎంతైనా ఉందీ అంటూ లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది, ఆ వార్తల ప్రకారం. రవితేజ మళయాళము లో బ్లాక్ బస్టర్…
హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా తెలుగు రీమేక్ లో నటించిన అవకాశం ఎంతైనా ఉందీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసే మరో న్యూస్ ఏంటంటే ఈ సినిమా కి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యవహరించే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ పై మొదటి నుండి రామ్ చరణ్ పేరు…
వినిపిస్తూనే ఉండగా నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనీ రామ్ చరణ్ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు రీమేక్ పై వార్తలు గట్టిగా శిఖారు చేస్తుండగా రవితేజ పేరు కూడా వచ్చింది కాబట్టి ఈ సారి అయినా ఈ రీమేక్ ని కన్ఫాం చేసి తెలుగు లో రీమేక్ చేస్తారో లేదో అన్నది ఆసక్తిగా మారింది.