ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చిన్నా చితకా సినిమాలు చాలా వచ్చాయి… వాటిలో కొంచం నోటబుల్ గా అనిపించే సినిమాల్లో వాంటెడ్ పండుగాడ్ ఒకటి అని చెప్పాలి. సునీల్, వెన్నెల కిషోర్, సుడిగాలి సుదీర్, అలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఇలా కమెడియన్స్ అందరూ కనిపించిన ఈ సినిమాను కే రాఘవేంద్రరావు సమర్పణలో రిలీజ్ చేశారు. ఇంతమంది కమెడియన్స్ ఉన్న వాంటెడ్ పండుగాడ్ సినిమా కథ విషయానికి వస్తే….
జైలులో నుండి సునీల్ తప్పించుకుంటాడు, తనకోసం వెతికి వెతికి ఇక తనని పట్టించిన వాళ్ళకి కోటి బహుమతి అని ప్రకటించడంతో ఈ విషయం తెలిసిన న్యూస్ రీడర్స్ అయిన సుదీర్ దీపికా పిల్లితో పాటు మిగిలిన గ్యాంగ్ అందరూ కూడా సునీల్ ని పట్టుకోవడానికి తిరిగుతూ ఉంటారు…
ఇంతకీ సునీల్ ఎందుకు జైలుకి వెళ్ళాడు, సునీల్ టోటల్ గ్యాంగ్ కి దొరికాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కానీ కథ పరంగా ఎంత సిల్లీ లైన్ తో సినిమా ఉందో సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంతే నీరసంగా బోర్ కొట్టిస్తూ కథ నత్తనడకన సాగుతూ ఉంటుంది, ఫోర్స్ కామెడీ, ఏమాత్రం ఇంప్రెస్ చేయని…
మ్యూజిక్, లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కలిపి సినిమా ఏ దశలో కూడా బాగుంది అనిపించేలా సాగదు. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఎవ్వరి పాత్ర గుర్తుండేలా తీర్చిదిద్దలేదు… హీరోయిన్స్ మాత్రం గ్లామర్ షో తో ఆకట్టుకున్నా లోకేషన్స్ కొంచం బెటర్ గా సినిమాటోగ్రాఫర్ చూపించడం లాంటివి పక్కకు పెడితే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవనే చెప్పాలి… ఉన్నంతలో జబర్దస్త్ కి…
ఎక్స్ టెన్షన్ వర్షన్ లా ఉన్న ఈ వాంటెడ్ పండుగాడ్ అక్కడక్కడా కొన్ని నవ్వులు తెప్పించినా ఓవరాల్ గా సహనానికి పరీక్ష పెట్టె సినిమాల్లో ఒకటి అని చెప్పాలి. మొత్తం మీద ఫోర్స్ కామెడీ ని బరించి చాలా ఓపిక చేసుకుని చూస్తె అతి కష్టం మీద పర్వాలేదు అనిపించవచ్చు ఈ సినిమా…