టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సుకుమార్ కూడా ఒకరు, చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ గుర్తుంపు ని సొంతం చేసుకున్న సుకుమార్ తన ప్రతీ సినిమా లో కూడా ఎదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటారు, తన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా స్టైలిష్ మూవీస్ కాగా రంగస్థలంతో తన రూట్ మార్చారు సుకుమార్. రా రస్టిక్ కథని ఎంచుకుని మంచి ఎమోషన్స్ ఉన్న స్క్రీన్ ప్లే తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఊచకోత కోశారు, ఆ సినిమా వచ్చి రెండేళ్ళు అవుతుండగా తన అప్ కమింగ్ మూవీ ని ముందు మహేష్ బాబు తో అనుకున్నా ఆ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన కాన్సిల్ అవ్వగా అల్లు అర్జున్ తో సినిమా ను కమిట్ అయ్యారు.
ఆ సినిమానే పుష్ప…. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజున అఫీషియల్ గా మొదలు అయిన ఈ సినిమా అందరికీ షాక్ ఇస్తూ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచి షాక్ ఇవ్వగా ఈ సినిమా కి గాను సుకుమార్ కి కూడా…
రెమ్యునరేషన్ పరంగా కెరీర్ లో హైయెస్ట్ రేటు సొంతం కాబోతుందని టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. రంగస్థలం సినిమాకి 12 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని అందుకున్న సుకుమార్ ఇప్పుడు పుష్ప సినిమా కి రెమ్యునరేషన్ తో పాటు ఓవరాల్ ప్రాఫిట్ షేర్ కూడా తీసుకోబోతున్నారట. కేవలం రెమ్యునరేషన్ పరంగానే సుకుమార్ కి ఈ సినిమా కి గాను…
20 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ దక్కబోతుందని సమాచారం. ఇక ప్రాఫిట్ షేర్ లో 5% వస్తుందని అంటున్నారు. ఇది హైయెస్ట్ రెమ్యునరేషన్ కాగా రెండేళ్ళు గ్యాప్ రావడం మహేష్ తో సినిమా కాన్సిల్ అవ్వడం, అల్లు అర్జున్ కోసం చాలా టైం ఎదురు చూడటం లాంటివి కన్సిడర్ చేస్తే ఈ గ్యాప్ లో సుకుమార్ ఏ సినిమా చేసినా ఈ రేంజ్ రెమ్యునరేషన్ వచ్చి ఉండేది, ఆ లెక్కన చూసుకుంటే ఒక సినిమా రెమ్యునరేషన్ లాస్ అయ్యాడు సుకుమార్…