అమ్మింది 1.5 కోట్లకి..TRP రేటింగ్ తెలిస్తే షాక్!

0
1238

   

సుమంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీస్ మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ విజయాలను అందుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే, మళ్ళీరావా తర్వాత సుమంత్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా నిరాశ నే మిగిలించాయి. ఇలాంటి సమయం లో కార్తీకేయ లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన లేటెస్ట్ మూవీ సుబ్రమణ్యపురం…

కూడా నిరాశ పరచగా సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులు కొనడానికి ఎవ్వరూ ముందుకు రాని సమయం లో జీ తెలుగు వారు ఈ సినిమా ను 1.5 కోట్ల ఫ్యాన్సీ రేటు ఇచ్చి దక్కించు కున్నారు. రీసెంట్ గా సినిమా ని టెలికాస్ట్ చేయగా సినిమా కి బడ్జెట్ అండ్ బిజినెస్ దృశ్యా…

మంచి TRP రేటింగ్ దక్కిందని చెప్పాలి. కాగా ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఛానెల్ వాళ్ళ కి సినిమా ద్వారా చాలా డబ్బులు మొదటి టెలికాస్ట్ సమయం లో నే రావడం తో వాళ్ళు సంతోషం లో ఉన్నారని సమాచారం. మొత్తం మీద మొదటి టెలికాస్ట్ లో సుమంత్…

సుబ్రమణ్యపురం సినిమా కి 7.8 TRP రేటింగ్ దక్కిందట… ఇది కొన్ని పెద్ద సినిమాల TRP రేటింగ్ లతో పోల్చితే సమానం లేక ఎక్కువే అనే చెప్పాలి. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ పరంగా నిరాశ పరిచినప్పటికీ సినిమా మాత్రం బుల్లి తెరపై అనుకున్న లెవల్ లోనే విజయం అందుకుంది.

సినిమా రెస్పాన్స్ చూసి రెండో సారి త్వరలో టెలికాస్ట్ చేయబోతుందట జీ తెలుగు. దాంతో ఈ సినిమా వల్ల ఫుల్ ప్రాఫిట్స్ లో జీతెలుగు నిలవబోతుందని అంటున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర నిర్మాత కి నిరాశనే మిగిలించినా బుల్లి తెరపై ఛానెల్ వల్ల కి మాత్రం లాభాల పట్టేలా చేస్తుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!