యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ గా ఏ 1 ఎక్స్ ప్రెస్ తో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా మార్క్ ని కంప్లీట్ చేసుకుని టాలీవుడ్ లో ఈ మార్క్ ని అందుకున్న హీరోల సరసన ఒకరిగా చేరాడు, ఈ 25 సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ రిలీజ్ ను సొంతం చేసుకోలేక పోయాయి. అలాంటి సినిమాలలో మూడేళ్ళ క్రితం తమిళ్ మరియు తెలుగు లో…
ఒకే సారి రూపొందిన సినిమా ఒకటి అప్పటి నుండి రిలీజ్ కి నోచుకోలేదు, కానీ ఎట్టకేలకు ఇప్పుడు మూడేళ్ళ తర్వాత ఆ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్దం చేస్తున్నారని సమాచారం. సందీప్ కిషన్, అరవింద్ స్వామి మరియు శ్రేయ లాంటి మంచి స్టార్ కాస్ట్ తో…
రూపొందించిన సినిమా నరకాసురుడు…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 టైం లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ బైలింగువల్ మూవీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన అప్పటి నుండి రిలీజ్ ఆగిపోగా ఆడియన్స్ ముందుకు ఇక సినిమా వస్తుందా లేదా అన్న అనుమానాలు మొదలు అవ్వగా లాస్ట్ ఇయర్ డైరెక్ట్ రిలీజ్ కి…
కూడా పెద్దగా ట్రై చేయని మేకర్స్ ఎట్టకేలకు ఇప్పుడు సెకెండ్ వేవ్ టైం లో సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని సమాచారం. సినిమా డైరెక్టర్ రీసెంట్ గా సినిమా పోస్టర్ ని ఇంస్టగ్రామ్ లో పోస్టర్ ని రిలీజ్ చేయడం తో సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఆడియన్స్ ముందుకు డిజిటల్ రిలీజ్ గా వచ్చే…
అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మంచి స్టార్ కాస్ట్ తో రూపొందిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా మంచి రిజల్ట్ నే సొంతం చేసుకునేది కానీ ఇప్పుడు ఆగి ఆగి డిజిటల్ రిలీజ్ వైపు వెళుతుంది కాబట్టి రేటు కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సినిమా కంప్లీట్ బడ్జెట్ వివరాలు అలాగే డిజిటల్ రిలీజ్ రేటు వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.