టాలీవుడ్ హీరోలలో చాలా కాలంగా మంచి హిట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో సందీప్ కిషన్ కూడా ఒకరు. కెరీర్ లో రీసెంట్ టైంలో కొన్ని డీసెంట్ ప్రాజెక్ట్ లు చేస్తున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో అయితే రిజల్ట్ రావడం లేదు….రెండేళ్ళ క్రితం ఊరు పేరు భైరవకోన తో పర్వాలేదు అనిపించిన తర్వాత సోలో హీరోగా సందీప్ కిషన్..
నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా శివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వగా పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా అయితే వాడుకోలేదు… ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
రీసెంట్ టైంలో తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా అయితే నిలిచింది. రెండేళ్ళ క్రితం వచ్చిన ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్ తో కలిపి సందీప్ కిషన్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తో 2.10 కోట్లతో టాప్ లో నిలిచింది. ఇప్పుడు మజాకా మూవీ మొదటి రోజున…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.25 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సొంతం చేసుకుని కెరీర్ లో టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఒకసారి సందీప్ కిషన్ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే…
#SundeepKishan Recent Movies 1st Day Collections in AP TG
👉#Mazaka – 1.25CR******
👉#OoruPeruBhairavakona – 2.10CR(inc premieres)
👉#Michael – 1.10CR
👉#GullyRowdy – 61L
👉#A1Express – 76L
👉#TenaliRamaKrishnaBABL – 55L
👉#NinuVeedaniNeedanuNene – 90L
మొత్తం మీద ఇది వరకటితో పోల్చితే కెరీర్ లో కొంచం గ్రోత్ అయితే ఉంది కానీ అది అనుకున్న రేంజ్ స్పీడ్ ని అయితే ఇంకా అందుకోవడం లేదని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మజాకా మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.