కరోనా ఎఫెక్ట్ వలన ఎప్పుడు ఎం జరుగుతుంది అన్నది ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. ఇయర్ ఎండ్ కి పరిస్థితులు సద్దుకుంటాయి అని అంటున్నా అలా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్న నేపధ్యంలో ముఖ్యంగా కోట్ల తో మార్కెట్ చేసే సినిమా పరిశ్రమలు ఈ పరిస్థితులను ఎలా ఎదురుకోవాలో తెలియక మరింత కష్టపడుతున్నారు. ఎక్కువగా ఫైనాన్స్ మీద సినిమాలు చేసే వాళ్ళు ఉండటం తో సినిమాలు లేట్ అయిన కొద్దీ వడ్డీలు…
భారీగా పెరిగి పోతూ ఉంటాయి. అందుకే చాలా మంది నిర్మాతలు ఎదో ఒక రేటు కి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య నటించిన కొత్త సినిమా రీసెంట్ గానే అసలు డిజిటల్ రిలీజ్ చేయమని…
ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు… కానీ ఏమైందో ఏమో కొన్ని రోజులకే అందరికీ ఒక్కసారి షాక్ ఇస్తూ సినిమాని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశామని, ఒక నిర్మాతగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పడం తో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో భారీ షాక్ కి గురి అయ్యారు.
సరైన కారణాలు ఏంటి, ఎంతకు అమ్మారు లాంటి వివరాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సినిమా ను అక్టోబర్ 30 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫాం చేశారు. తమిళ్ తో పాటు సినిమా తెలుగు, మలయాళం మరియు కన్నడ లో కూడా డబ్ అయ్యి అదే రోజున రిలీజ్ అవుతుందని కన్ఫాం చేశారు.
బాలీవుడ్ లో బిగ్ మూవీస్ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకున్నా సౌత్ లో మాత్రం బిగ్ మూవీస్ ఏవి ఇలా రిలీజ్ ని కన్ఫాం చేసుకోలేదు, రీసెంట్ గా టాలీవుడ్ తరుపున బిగ్ మూవీగా నాని వి మూవీ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా ఇప్పుడు సౌత్ మొత్తం మార్కెట్ ఉన్న సూర్య సినిమా ఇలా డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోవడం తో మరిన్ని సినిమాలు ఇప్పుడు ఇదే రూట్ లో నడిచే అవకాశం ఉందని అంటున్నారు…