Home న్యూస్ సూర్యకి తెలుగు లో తగ్గని క్రేజ్….మిక్సుడ్ టాక్ తో కూడా కొట్టాడు…కానీ!!

సూర్యకి తెలుగు లో తగ్గని క్రేజ్….మిక్సుడ్ టాక్ తో కూడా కొట్టాడు…కానీ!!

0

తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న తమిళ్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది. ఇక సినిమా తెలుగు లో భారీ పోటిలో రిలీజ్ అయింది.

నాని హిట్3 మూవీ సాలిడ్ బజ్ నడుమ గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా రెట్రో మూవీ కి తెలుగు లో అసలు ఏమాత్రం బజ్ అయితే ఏర్పడలేదు అనే చెప్పాలి. కనిమా సాంగ్ తమిళ్ లో సూపర్ హిట్ అవ్వగా తెలుగు లో లేట్ గా తీసుకురావడం తో బజ్ కూడా లేట్ గా పెరిగింది…

కానీ రిలీజ్ టైంకి ట్రైలర్ కూడా అనుకున్న రేంజ్ లో క్లిక్ అవ్వకపోవడం, హిట్3 కి బెటర్ టాక్ రావడంతో రెట్రో ఇక తేరుకోవడం కష్టమే అనుకున్నా వీకెండ్ లో ఒక పక్క హిట్3 కుమ్ముతున్నా కూడా రోజుకి కోటికి తగ్గకుండా గ్రాస్ ను రెట్రో తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది.

Suriya RETRO Movie 1st Day Total WW Collections!!

ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 6.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది సినిమా….మొదటి రోజు వచ్చిన టాక్ కి ఇంతవరకు రావడం కూడా కష్టమే కాని ఎలాగోలా పోటిలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. లాస్ట్ ఇయర్ కంగువ కూడా ఒకప్పటి…

సూర్య సినిమాలను తలపించేలా ఓపెన్ అయింది. కానీ టాక్ వలన లాంగ్ రన్ ఏమి సొంతం చేసుకోలేదు. సూర్య మంచి సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో పార్ సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటం తో తన మార్కెట్ పై ఇంపాక్ట్ పడగా…

తెలుగు లో కూడా ఆ ఇంపాక్ట్ ఉన్నా ఇప్పటికీ సూర్య సినిమాలు థియేటర్స్ కి వెళ్లి చూసే ఆడియన్స్ చాలానే ఉన్నారు అని రెట్రో మిక్సుడ్ టాక్ తో కూడా కొద్ది వరకు రుజువు చేసింది. కానీ సూర్య నుండి నికార్సయిన కంబ్యాక్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పాలి. ఇక అది వెంకీ అట్లూరి డైరెక్షన్ లో చేసే సినిమాతోనే జరుగుతుందేమో చూడాలి.

Suriya RETRO Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here