చాలా కాలంగా ఒక నికార్సయిన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో ఒకరైన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కంగువ(Kanguva Movie Telugu Review and Rating), వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…మరి భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఎంతవరకు అంచనాలాను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…కొన్ని వందల ఏళ్ల క్రితం కొన్ని తెగల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది…క్రమంలో విలన్ అయిన బాబీ డియోల్ అలాగే తన తెగని కాపాడుకున హీరో సూర్య మధ్య పోరులో గెలిచింది ఎవరు…అలాగే ప్రజెంట్ టైంలో ఉండే మరో హీరోకి ఒక పాప కి లింక్ ఉంటుంది. ఆ లింక్ కంగువకి కూడా ఉంటుంది….ఆ అసలు కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కథ పరంగా కొంచం రెగ్యులర్ గానే అనిపించినా కూడా ఒక డిఫెరెంట్ పాయింట్ తో సినిమాను ప్రజెంట్ టైంకి కనెక్ట్ చేసిన తీరు బాగుంది…హిస్టారికల్ నేపధ్యంలో సాగే సినిమా మొత్తం ఆడియన్స్ ను మరో ప్రపంచంలో ఉన్న భావన కలిగిస్తుంది… కానీ రెగ్యులర్ కథని డైరెక్టర్ చాలా వరకు ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో నింపేశాడు…
ఇక యాక్షన్ సీన్స్, ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ లు సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్…విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నా కూడా, కథ పాయింట్ కానీ టేకింగ్ కానీ కన్ఫ్యూజింగ్ గా అనిపించడం, ఎక్కువ డ్రాగ్ అయినట్లు అనిపించింది…స్టార్ట్ అవ్వడమే ప్రజెంట్ టైంలో స్టార్ట్ అయ్యి స్లో నరేషన్ తో సాగిన సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక కొంచం ఊపు వస్తుంది.
సూర్య గెటప్ కానీ తన డైలాగ్స్ కానీ తన లుక్స్ కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కానీ అన్నీ బాగానే హైలెట్ గా నిలిచాయి. ఇక విలన్ బాబీ డియోల్ మరోసారి అదరగొట్టేశాడు. హీరో విలన్ మధ్య ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయి…సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించేలా ఉండగా
ఎలివేషన్ సీన్స్ కి దేవి శ్రీ ప్రసాద్ కొన్ని చోట్ల ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు….ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపించగా సినిమాటోగ్రఫీ విజువల్స్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నాయి, బోట్ సీన్స్ కొన్ని ఏరియల్ షాట్స్ బాగా మెప్పించాయి….ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా…
డైరెక్టర్ శివ స్టోరీ నార్మల్ పాయింట్ నే ఎంచుకున్నా చెప్పిన టైం హిస్టారికల్ గా మార్చేసి ఒక డిఫెరెంట్ యూనివర్స్ లో ఉన్న ఫీలింగ్ ని కలిగించాడు…కానీ ఫ్లాట్ నరేషన్, ఓవర్ ది టాప్ సీన్స్ లాంటివి రిపీట్ అయ్యి ఒక స్టేజ్ తర్వాత కొంచం ఇబ్బంది కలిగించాయి…
కొంచం స్క్రీన్ ప్లే పరంగా స్లో నరేషన్ అనిపించినా, కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఆడియన్స్ కోరుకునే చాలా ఎలిమెంట్స్ బాగా సెట్ అయ్యాయి సినిమాలో ఇక కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ లు కూడా సినిమాలో ఉండటంతో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చే టైంలో పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది కానీ కొంచం ఓపిక అవసరం…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…