కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ సాలిడ్ బజ్ ఉండగా బిజినెస్ పరంగా కూడా సూర్య ఫ్లాఫ్స్ లో ఉన్నా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా..
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా తమిళనాడులో సాలిడ్ లెవల్ లో 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక వరల్డ్ వైడ్ గా 2500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్…
ఆల్ రెడీ వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా తమిళనాడులో సూర్య కంగువ కన్నా కూడా బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు లో హిట్3 ఇంపాక్ట్ ఉంది. ఇక మిగిలిన చోట్ల కూడా మంచి ట్రెండ్ నే చూపెడుతున్న సినిమా…
ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే తమిళనాడులో మినిమమ్ 15 కోట్ల నుండి లెక్క స్టార్ట్ అయ్యే అవకాశం ఉండగా, టాక్ ను బట్టి కలెక్షన్స్ ఎంతవరకు వెళతాయి అన్నది చెప్పగలం. తెలుగు రాష్ట్రాల్లో హిట్3 ఉంది కాబట్టి టాక్ బుకింగ్స్ ట్రెండ్ ప్రస్తుతానికి..
కొంచం ఓకే అనిపించే రేంజ్ లోనే ఉండగా టాక్ డీసెంట్ గా ఉంటే మొదటి రోజు 2.5-3 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ అన్నీ కలిపి సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఇనీషియల్ ఎస్టిమేషన్ ఓవరాల్ గా 32-35 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా, టాక్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. మరి సూర్య ఈ సినిమా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ను ఎంతవరకు సొంతం చేసుకుంటాడో…ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటాడో చూడాలి.