Home న్యూస్ ఇది కదా ట్రైలర్ అంటే…సూర్య కంగువ ట్రైలర్ రివ్యూ!!

ఇది కదా ట్రైలర్ అంటే…సూర్య కంగువ ట్రైలర్ రివ్యూ!!

1
Suriya Kanguva Movie Trailer Review and Talk
Suriya Kanguva Movie Trailer Review and Talk

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోలలో ఒకరైన కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva Movie) శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఈ ఇయర్ అక్టోబర్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా….

సూర్యకి ఈ సినిమా ఎపిక్ కంబ్యాక్ మూవీగా నిలవడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బిగ్గెస్ట్ వసూళ్లు అందుకునే అవకాశం ఉందీ అనిపిస్తూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…ట్రైలర్ చూసిన తర్వాత విజువల్ వండర్ లా అనిపిస్తున్న కంగువ మూవీ…

సూర్య డైలాగ్స్ కొంచం క్లియర్ గా లేవు కానీ విజువల్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా మెప్పించింది అని చెప్పాలి. సినిమా హైప్ ను ఓ రేంజ్ లో ఈ ట్రైలర్ పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు…ట్రైలర్ లో కథ పాయింట్ ను కూడా రివీల్ చేయగా రెండు తెగలకు సంభందించిన ప్రజలు ఉండగా…

మరో తెగ ప్రజల మీద యుద్దాలు చేస్తూ వాళ్ళని అంతమొందించాలని చూస్తూ ఉండగా ఆ తెగకి లీడర్ గా విలన్ బాబీ డియోల్ నటిస్తూ ఉండగా మరో తెగని కాపాడే భాద్యత హీరో మీద పడగా హీరో విలన్ ల మధ్య గొడవలో ఎవరు గెలిచారు అన్నది సినిమా కథగా అనిపిస్తుంది..

తెలుగు డబ్బింగ్ మరింత శ్రద్ధ తీసుకుని సౌండ్స్ ప్రాపర్ గా ఉండేలా చూసుకుంటే ట్రైలర్ ఇంకా బాగా మెప్పించేది. సూర్య లుక్, మెస్మరైజింగ్ విజువల్స్, అల్టిమేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ కి మెయిన్ హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన…

బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా ఎలివేట్ చేసేలా చేసింది అని చెప్పాలి ఇప్పుడు…రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ కోలివుడ్ ట్రైలర్స్ లో కంగువ ముందు నిలుస్తుంది అని చెప్పాలి…సినిమా ఏమాత్రం ట్రైలర్ రేంజ్ లో అంచనాలను అందుకుంటే రికార్డులు చెల్లాచెదురు చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here