Home న్యూస్ ఆకాశం నీ హద్దు రా రివ్యూ….సూర్య నట విశ్వరూపం!!

ఆకాశం నీ హద్దు రా రివ్యూ….సూర్య నట విశ్వరూపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా సరైన హిట్ లేక ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరు తో డబ్ అవ్వగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన డైరెక్ట్ రిలీజ్ ను దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన గిఫ్ట్ ఇచ్చింది.

సినిమా కథ ఏంటి, సినిమా అంచనాలను ఏ రేంజ్ లో అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన హీరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తూ ఉండగా తన తండ్రి కి అనారోగ్యం వలన వెంటనే వెళ్ళాల్సిన అవసరం రాగా….

చాలినన్ని డబ్బులు లేక పోవడంతో విమానంలో ప్రయాణించలేకపోతాడు…తన తండ్రి చివరి చూపులు చూసుకోలేదు… తన లైఫ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వలన ఇతరులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఇబ్బంది పడకూడదు అని అతి తక్కువ డబ్బు తో విమాన ప్రయాణం చేయించాలని డిసైడ్ అవుతాడు.

పక్కా ప్లాన్ తో ఎయిర్ కంపెనీ ని మొదలు పెట్టాలని డిసైడ్ అవ్వగా అడుగడుగునా తనకి అవరోధాలు వస్తాయి, ఎదురైన ప్రతీ అవరోధాన్ని దాటుకుంటూ సూర్య ఎలా తను అనుకున్నది సాధించాడు అన్నది అసలు కథ… పెర్ఫార్మెన్స్ పరంగా సూర్య నట విశ్వరూపం సినిమా లో చూడొచ్చు. తను ఎంత మంచి నటుడో అందరికీ తెలిసిందే…

కానీ రీసెంట్ టైం లో తన నటనకి సరిపడా కథలు దక్కలేదు, కానీ ఈ సినిమా లో తన నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి, సూర్య పాత్రతో స్టార్ట్ లోనే మనం కూడా జర్నీ చేయడం మొదలు పెడతాం, తను భాద పడితే మనమూ బాద పడటం, తన విజయాన్ని మనం కూడా ఓన్ చేసుకుంటాం.

ఇలా తన పాత్ర ని కంప్లీట్ గా సూర్య కంట్రోల్ లో తీసుకుని తన కెరీర్ బెస్ట్ లో ఒకటి లేదా ఇదే కెరీర్ బెస్ట్ అనిపించే రేంజ్ పెర్ఫార్మెన్స్  ఇచ్చాడు, కొన్ని సీన్స్ లో సూర్య నటన కి సెల్యూట్ చేసి తీరాల్సిందే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ కొత్తమ్మాయి అపర్ణ సూర్య పక్కన బాగా సూట్ అయింది.

తన పాత్ర కూడా చాలా బాగా ఆకట్టుకోగా ఇద్దరి జంట చాలా బాగుంది, ఇక పరేష్ రావెల్ విలనిజం ఆకట్టుకోగా మోహన్ బాబు స్పెషల్ రోల్ క్లైమాక్స్ లో తన మార్క్ చూపెట్టి మెప్పిస్తుంది, మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా తమ వరకు న్యాయం చేసి పాత్రలకి జీవం పోశారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు అదుర్స్ అనిపిస్తుంది, సీన్ బై సీన్ సినిమా పై ఆసక్తి మరో లెవల్ కి వెళ్ళేలా చేసి ఇంటర్వల్ పాయింట్ దగ్గర సెకెండ్ ఆఫ్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తుంది, అదే టైం లో సెకెండ్ ఆఫ్ కథ కూడా ఊహించేలా ఉంటుంది…. అక్కడ నుండి కొద్దిగా డ్రా బ్యాక్ మొదలైంది, అది తర్వాత మాట్లాడుకుందాం…

సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం జివి ప్రకాష్ కుమార్ కుమ్మేశాడు… ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. సూర్య కి మన సత్యదేవ్ తెలుగు డబ్బింగ్ బాగా అనిపించినా కానీ…

సూర్య కి ఇది వరకు తెలుగు లో డబ్బింగ్ చెప్పిన వాయిస్ నే పెడితే బాగుండు అనిపించింది,… ప్రొడక్షన్ వాల్యూస్ అదిరి పోగా… డైరెక్షన్ పరంగా సుధ కొంగర రియల్ లైఫ్ స్టొరీ ని సినిమాగా చాలా బాగా ఆకట్టుకునేలా డైరెక్ట్ చేయగా ఆ కథకి సూర్య 100% న్యాయం చేసి మరో లెవల్ కి వెళ్ళేలా చేశాడు.

కానీ ఫస్టాఫ్ ఇచ్చినంత కిక్ సెకెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది అని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ లో హీరో కి మరిన్ని కష్టాలు ఎదురు అవుతూ ఉండగా అవి కొంచం రిపీటివ్ గా అనిపిస్తాయి, అలాగే ప్రతీ చోటా హీరో కి ఇలా అడ్డు వస్తూ ఉండటం అనుకున్నది జరగక పోతూ ఉండటం తో అసహనం కూడా అనిపిస్తుంది.

కానీ వాటిని అన్నీ మరిపించే విధంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ తో అద్బుతంగా కవర్ చేసి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ ఉండేలా చేయడంలో డైరెక్టర్ సుధ కొంగర మరియు సూర్య సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఇది బయోపిక్ కమర్షియల్ మూవీ కాదు అని గమనించి….

సినిమా చూడటం మొదలు పెడితే సినిమా అయిపోయాక ఒక అద్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది, రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసేవారికి కూడా సినిమా నచ్చుతుంది కానీ మరీ ఇంత ఇంపాక్టివ్ గా ఉండదు… సినిమా సూర్య రీసెంట్ టైం లో ది బెస్ట్ అండ్ కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3.25 స్టార్స్…. సెకెండ్ ఆఫ్ లో సగం వరకు డౌన్ అవ్వక పోయి ఉంటే సినిమా 3.5 రేటింగ్ తో మినిమమ్ అందుకునే సత్తా ఉన్న సినిమా అని చెప్పాలి. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా కి ఆడియన్స్ నుండి మరో లెవల్ రెస్పాన్స్ వచ్చి ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here