కోలివుడ్ స్టార్ హీరో సూర్య కి రీసెంట్ టైం లో సరైన హిట్ లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే, రీసెంట్ మూవీస్ అన్నీ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీసే అయినా అవి అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో కమర్షియల్ మూవీ కాకుండా మరో డిఫెరెంట్ మూవీ తో ఆడియన్స్ ముందు ఈ సమ్మర్ లో రావాల్సిన సూర్య కరోనా వలన ఆగిపోయాడు. ఆ సినిమా నే ఆకాశం నీ హద్దుగా…
ఈ సినిమా పై డీసెంట్ క్రేజ్ ఏర్పడగా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు, కానీ ఇంతలో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ అవ్వడం తో డైరెక్ట్ రిలీజ్ లు మొదలు అయ్యాయి. కోలివుడ్ లో డైరెక్ట్ రిలీజ్ ని మొదటగా చేసింది సూర్యనే..
తన నిర్మాణంలో జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన పోన్మగల్ వందాన్ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే టైం లో పెద్ద గొడవే జరిగింది తమిళ్ లో. సూర్య సినిమాలు బ్యాన్ చేస్తున్నామని బెదిరించగా… నాకు 70 కోట్ల అప్పు ఉంది మీరు తీరుస్తారా అంటూ సూర్య ఫైర్ కూడా అయ్యాడు, అయినా సినిమాను రిలీజ్ చేశాడు.
ఈ మాట విన్న చాలా OTT యాప్స్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దుగా సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ భారీ ఆఫర్స్ ఇవ్వగా అక్కడ బయ్యర్లు సూర్య ఈ సినిమాను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తాడా అన్న డౌట్ లో ఉండగా లేటెస్ట్ గా ఆఫర్ ఏకంగా 65 కోట్ల రేంజ్ లో వచ్చిందని సమాచారం.
దాంతో బయ్యర్లు ఇక ఈ సినిమా డైరక్ట్ డిజిటల్ రిలీజ్ కన్ఫాం అనుకున్న టైం లో సినిమా నిర్మాతలు సూర్య అందరి గురించి ఆలోచించి ఈ సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తర్వాతే OTT లో వస్తుందని తెగేసి చెప్పారట. దాంతో బయ్యర్లు థియేటర్స్ ఓనర్లు సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. పెద్ద హీరో సినిమా ఇలా డైరెక్ట్ రిలీజ్ అయితే అన్ని సినిమాలు క్యూ కడతాయని వాళ్ళ భాద, ఇది అర్ధం చేసుకుని సూర్య తెగేని నో చెప్పేశాడు…