Home న్యూస్ గ్యాంగ్ – అమ్మింది 4.5 కోట్లకు…షాకింగ్ TRP…మొత్తం రికవరీ అంట!

గ్యాంగ్ – అమ్మింది 4.5 కోట్లకు…షాకింగ్ TRP…మొత్తం రికవరీ అంట!

345
0

     కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ గ్యాంగ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో కూడా అదే సమయం లో రిలీజ్ అవ్వగా అప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సినిమా లు అంచనాలు తప్పడం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ వెంచర్ గా మారింది. కాగా సినిమా మొత్తం మీద 7 కోట్ల దాకా షేర్ ని అందుకుని క్లీన్ హిట్ జాబితా లో నిలిచింది.

దాంతో సినిమా ను తెలుగు లీడింగ్ ఛానెల్ అయిన స్టార్ మా భారీ రేటు ఇచ్చి హక్కులు దక్కించుకుంది. డబ్బింగ్ మూవీ నే అయినా కానీ ఏకంగా 4.5 కోట్ల దాకా రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమా టెలికాస్ట్ ని మాత్రం…

కొంచం లేట్ గానే చేశారు అని చెప్పాలి. ఏకంగా ఏడాది తర్వాత రీసెంట్ గా సినిమా ను స్టార్ మా లో ప్రసారం చేశారు. కాగా సినిమా కి అదిరి పోయే లెవల్ లో TRP రేటింగ్ దక్కిందని చెప్పొచ్చు. గగ్యాంగ్ సినిమా కి తొలిసారి టెలికాస్ట్ సమయం లో ఏకంగా…

8.2 TRP రేటింగ్ దక్కింది. సినిమా లేట్ కి, లో బజ్ కి ఈ రేంజ్ లో TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఇక్కడ విశేషం ఏంటి అంటే స్టార్ మా కి ఈ సినిమా తొలి టెలికాస్ట్ లోనే దాదాపు పెట్టిన డబ్బు ని రికవరీ చేసే లెవల్ లో సక్సెస్ అవ్వడం అని చెప్పొచ్చు.

ఇక సూర్య నటిస్తున్న అప్ కమింగ్ మూవీ NGK ప్రేక్షకుల ముందుకు ఈ ఇయర్ సమ్మర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, తమిళ్ తో పాటు తెలుగు లోను ఈ సినిమా ఒకే సమయం లో రిలీజ్ అవుతుందని సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here