సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమాల రిలీజ్ లు ఆగిపోగా మన దగ్గర టికెట్ రేట్ల ఇష్యూ వలన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి టైం పడుతూ ఉండగా మరో పక్క కోలివుడ్ లో ఇప్పటికీ థియేటర్స్ తెరచుకోలేదు. అక్కడ సినిమాలు ఇంకా డిజిటల్ రిలీజ్ వైపే అడుగులు వేస్తూ ఉన్నాయి. తెలుగు తో పోల్చితే కోలివుడ్ లో లాస్ట్ ఇయర్ నుండి ఎక్కువ సినిమాలు డిజిటల్ రిలీజ్ ను దక్కించుకున్నాయి.
అందులో బిగ్ మూవీస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ సూర్య నటించిన సూరరై పోట్రు సినిమా ఈ ఇయర్ ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా లు డిజిటల్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ గా నిలవగా ఇప్పుడు మరో బిగ్ మూవీ కూడా డైరెక్ట్ గా….
డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రాబోతుంది. సూర్య రీసెంట్ గా తన పుట్టిన రోజున అనౌన్స్ చేసిన సినిమాల్లో లాయర్ రోల్ లో కనిపించబోతున్న జై భీమ్ అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని…
పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చెప్పినా రీసెంట్ గా సూర్య తన నిర్మాణంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ 4 మూవీస్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి డిజిటల్ రిలీజ్ కోసం అమ్మేశాడు. అందులో జై భీమ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కి గాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సాలిడ్ రేటు నే ఇచ్చారని తెలుస్తుంది. ఎక్స్ పెరి మెంటల్ మూవీ లా తెరకెక్కుతున్న…
ఈ సినిమా కోసం 40 కోట్ల రేంజ్ లో రేటు ని ఇచ్చారని కోలివుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇదే ఫైనల్ అమౌంట్ ఆ లేక ఇంకా రేటు ఏమైనా పెరిగిందా అన్నది త్వరలోనే క్లారిటీ రాబోతుంది. ఇక ఈ సినిమా నవంబర్ లో డిజిటల్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కన్ఫాం తో మరిన్ని సినిమాలు కూడా OTT బాట పట్టడం ఖాయమని చెప్పొచ్చు.