Home న్యూస్ సౌత్ లో రికార్డ్ రేటు…అప్పులన్నారు…అమ్మం అన్నారు…మైండ్ బ్లాంక్ చేసిన సూర్య!

సౌత్ లో రికార్డ్ రేటు…అప్పులన్నారు…అమ్మం అన్నారు…మైండ్ బ్లాంక్ చేసిన సూర్య!

0

కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు థియేటర్స్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ముందు ఇది గమనించే బాలీవుడ్ వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలను మంచి డీల్ వచ్చిన వెంటనే అమ్మేశారు. కానీ సౌత్ లో మాత్రం పరిస్థితులు సద్దుకున్నాకే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు పరిస్థితులు ఏమాత్రం సెట్ అవ్వక పోవడం తో ఇక తప్పక…

ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నారు. తెలుగు లో నాని వి మూవీ ఇలానే డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా… సౌత్ లో హైయెస్ట్ రేటు పలికిన సినిమా గా ఇప్పుడు సూర్య నటిస్తిస్తున్న లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు సినిమా నిలిచింది.

జూన్ టైం లో తన భార్య జ్యోతిక నటించిన పోన్మగల్ వందాన్ టైం లో థియేటర్ ఓనర్లు డిజిటల్ రిలీజ్ ని బహిష్కరిస్తున్నాం అంటే…నాకు 70 కోట్ల అప్పుడు ఉంది మీరు తీరుస్తారా… ఒక నిర్మాతగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పాడు సూర్య. ఇప్పుడు కూడా పరిస్థితులను ఆలోచించే…

తన సినిమాను ముందు వద్దు అనుకున్నా కానీ తర్వాత జరిగిన పరిస్థితులను గమనించే సినిమాను అమెజాన్ ప్రైమ్ కి రికార్డ్ రేటు కి అమ్మారని సమాచారం. సౌత్ లో హైయెస్ట్ రేటు అందుకున్న ఈ సినిమా ను తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ మరియు మలయాళం కలిపి అక్షరాలా 65 కోట్లకు అమ్మారని సమాచారం. ఇక సూర్య అమ్మిన తర్వాత ఓపెన్ లేటర్ లో…

నిర్మాతగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ పరిస్థితులు సద్దుకున్నాక వెనువెంటనే 2 సినిమాలు చేసి అందులో 5 కోట్లు సినీ వర్కర్స్ కి ఇస్తానని మాట ఇచ్చాడు… దాంతో అందరూ తన నిర్ణయానికి ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 30 న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్హం అవుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here