బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సెకెండ్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన తర్వాత రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మాత్రం కొంచం స్లో డౌన్ అయిన సినిమా మొత్తం మీద రెండు వారాలు పూర్తీ అయ్యే టైం కి….
పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది కానీ ఇంకా హోల్డ్ చేసి గ్రోత్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొదటి వారంలో మొత్తం మీద 78.90 కోట్ల షేర్ ని అందుకుంటే….
ఇప్పుడు రెండో వారం మొత్తం మీద సినిమా 8.80 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని ఓవరాల్ గా భారీగానే స్లో అయింది కానీ సినిమా టాక్ దృశ్యా చూసుకుంటే పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2 వారాలు….
పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 32.77Cr
👉Ceeded: 11.31Cr
👉UA: 12.21Cr
👉East: 8.35Cr
👉West: 5.51Cr
👉Guntur: 8.41Cr
👉Krishna: 5.73Cr
👉Nellore: 3.41Cr
AP-TG Total:- 87.70CR(132.00CR~ Gross)
👉KA+ROI:- 6.65Cr
👉OS: 12.30Cr
Total WW:- 106.65CR(171.30CR~ Gross)
ఇదీ మొత్తం మీద 2 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క….
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల బిజినెస్ కి 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.35 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.