Home న్యూస్ SVSC రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్….క్లాస్ మూవీ ఊరమాస్ ఓపెనింగ్స్!!

SVSC రీ రిలీజ్ 1st డే కలెక్షన్స్….క్లాస్ మూవీ ఊరమాస్ ఓపెనింగ్స్!!

0

2013 టైంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యి క్లాసిక్ హిట్ గా పేరు తెచ్చుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) ఆల్ మోస్ట్ 12 ఏళ్ల తర్వాత సినిమా గ్రాండ్ గా అన్ సీజన్ లో రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి.

సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు ఆల్ మోస్ట్ 45 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా…రిలీజ్ రోజున సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు బాగానే పడ్డాయి…అన్ సీజన్ లో ఇలా ఓ క్లాస్ మూవీ రీ రిలీజ్ కి హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం అయితే….

ఆల్ మోస్ట్ మొదటి రోజున సినిమా 27 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా వీకెండ్ కి గాను టోటల్ గా 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరిగాయి…ఓవరాల్ గా సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి…ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి మొదటి రోజున 2.90 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను రీ రిలీజ్ లో సొంతం చేసుకుందని చెప్పాలి. 

కొన్ని చోట్ల ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ సీజన్ లో ఓ క్లాసిక్ మూవీ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలాంటి ఓపెనింగ్స్ ని అందుకోవడం మాస్ రచ్చ కాగా..వీకెండ్ లో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

ఒక్క నైజాంలోనే సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక మహేష్ బాబు రీసెంట్ రీ రిలీజ్ లు అన్నీ కూడా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం మాస్ రచ్చ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here