నిర్మాత 40 అన్నాడు…బయ్యర్లు షాక్ అయ్యారు

0
616

     మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 లాంటి హిస్టారికల్ 100 కోట్ల సినిమా తర్వాత రెండేళ్ళు గా మెగాస్టార్ చిరంజీవి వర్క్ చేస్తున్న ప్రేస్టీజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణం లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నయనతార హీరోయిన్ గా ఇతర ఇండస్ట్రీ ల స్టార్ కాస్ట్ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ… ఈ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు…

రాబోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా ఇప్పటి నుండే బిజినెస్ విషయం లో జోరు అందుకోగా ఓవర్సీస్ లో క్రేజ్ దృశ్యా భారీ రేట్లు కోట్ చేస్తున్నారట నిర్మాతలు. కానీ అక్కడ బయ్యర్లు సినిమా రేటు చూసి షాక్ అవుతున్నారన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో…

చక్కర్లు కొడుతుంది, వివరాల్లోకి వెళితే సైరా నరసింహా రెడ్డి పీరియాడికల్ మూవీ అవ్వడం తో ఓవర్సీస్ లో సినిమా కి అల్టిమేట్ కలెక్షన్స్ రావడం పక్కా అని భావించిన నిర్మాత సినిమా కి ఏకంగా 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ రావాలని వెయిట్ చేస్తున్నాడట. ఆ రేట్లు చెప్పడంతో…

బయ్యర్లు షాక్ అవ్వగా ఆ రేటు చాలా కష్టం అని బ్రేక్ ఈవెన్ కి ఏకంగా 10 మిలియన్ డాలర్స్ దాకా వసూల్ చేయాల్సి ఉంటుందని నో చెప్పారట. ఎక్కువ లో ఎక్కువ 18 నుండి 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ కి సిద్ధం అంటున్నారట అక్కడ బయ్యర్లు.

ఈ రేంజ్ లో రికవరీ అవ్వాలన్నా 5 మిలియన్స్ దాకా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది, కానీ సినిమా యూనిట్ ఆ ఆఫర్ కి సిద్ధంగా లేరని అంటున్నారు. దాంతో రిలీజ్ కి ఇంకా సమయం ఉండటం తో ఫైనల్ గా ఓవర్సీస్ బిజినెస్ ఎంత వరకు జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!