టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 53.72 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ టాలీవుడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గ్రాస్ 85 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
రెండో రోజు కూడా స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డే ఎఫెక్ట్ ను సైతం ఎదురుకుని సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నా ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలతో కలిపి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాలిడ్ గానే ఉండే అవకాశం ఉంది.
ఇక సినిమా రెండో రోజు తెలుగు లో అవలీలగా 10 కోట్ల రేంజ్ షేర్ ని, హిందీ కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2 నుండి 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా 2 కోట్ల రేంజ్ కి తగ్గకుండా షేర్ రావచ్చు అంటున్నారు.
దాంతో రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 14 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది, అలాగే గ్రాస్ 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో ఉండే చాన్స్ ఉంది. దాంతో ఆ కలెక్షన్స్ తో కలిపి 2 రోజుల్లో సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని టోటల్ గా 110 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
టాలీవుడ్ హిస్టరీ లో బాహుబలి పార్ట్ 2, సాహో లు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ని అందుకోగా బాహుబలి పార్ట్ 1 మరియు ఇప్పుడు సైరా లు రెండో రోజు లోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకుని ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న టాలీవుడ్ సినిమా లుగా నిలిచాయి. ఇక రెండు రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.