టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి వసూళ్లు సాధిస్తుంది. అన్ని చోట్లా బుకింగ్స్ స్లో గా స్టార్ట్ అవ్వడం మల్టీ ప్లేక్సులలో రిలీజ్ కి ముందు రోజే ఓపెన్ అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ టాలీవుడ్ హిస్టరీ లో…
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతుంది, ఇప్పటికే నైజాం లో ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు సీడెడ్ ఏరియాలో కూడా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొదటి రోజు రాయలసీమ లో
సైరా నరసింహా రెడ్డి కి 5.91 కోట్ల షేర్ దక్కింది. ఇది వరకు ఇక్కడ వినయ విదేయ రామ సినిమా కి 7.2 కోట్లు, బాహుబలి 2 కి ఇక్కడ 6.35 కోట్ల షేర్ మొదటి రోజు దక్కాగా ఇప్పుడు మూడో ప్లేస్ లో సైరా నరసింహా రెడ్డి నిలిచి సంచలనం సృష్టించింది. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటి ఉంది.
వినయ విదేయ రామ సినిమా కి 4.6 కోట్లు హైర్స్ దక్కగా బాహుబలి 2 కి ఎలాంటి హైర్స్ లేవు ఇక సైరా సినిమా కి ఫస్ట్ డే 2.23 కోట్ల హైర్స్ సీడెడ్ ఏరియా లో దక్కాయి. ఏవైనా కలెక్షన్స్ ఏ కాబట్టి మొత్తం మీద సైరా సినిమా సంచలన కలెక్షన్స్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.
ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సాహో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది, కొద్ది సేపట్లో అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అవుతాయి… అప్పటి వరకు ఎదురు చూడండి..