Home గాసిప్స్ సైరా కి ఇప్పటి వరకు కన్ఫాం అయిన హైర్స్…షాకింగ్!!

సైరా కి ఇప్పటి వరకు కన్ఫాం అయిన హైర్స్…షాకింగ్!!

973
0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా పై నెలకొన్న క్రేజ్ దృశ్యా బిజినెస్ అండ్ రిలీజ్ భారీ ఎత్తున సినిమా కి సొంతం అవుతున్నా కానీ ఇప్పటి వరకు సినిమా కి దక్కిన హైర్స్ ఒకింత షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి. దసరా సీజన్ లో రిలీజ్ అవుతున్నా…

డే 1 నేషనల్ హాలిడే ఉన్నా కానీ సినిమా కి మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో అయితే ఇప్పటి వరకు హైర్స్ కన్ఫాం కాలేదు. కాగా మొత్తం మీద కన్ఫాం అయిన హైర్స్ వివరాలను గమనిస్తే… గుంటూరు లో 2.5 కోట్ల హైర్స్ ని సొంతమ్ చేసుకున్న సినిమా..

వెస్ట్ ఏరియా లో 1.07 కోట్ల హైర్స్ ని ఇప్పటి వరకు కన్ఫాం చేసుకుంది, మొత్తం మీద ఈ 2 ఏరియాల్లో సినిమా కి హైర్స్ అఫీషియల్ గా కన్ఫాం అవ్వగా టోటల్ లెక్క 3.57 కోట్లు మాత్రమె అయింది. ఈ ఇయర్ సంక్రాంతి కి వచ్చిన వినయ విదేయ రామ ఏకంగా 10.8 కోట్ల హైర్స్ ని అందుకుంది.

సమ్మర్ లో వచ్చిన మహర్షి సైతం 6 కోట్ల దాకా హైర్స్ మొదటి రోజు దక్కాయి…. కానీ దసరా బరిలో ఉన్న సైరా కి ఇప్పటి వరకు 3.57 కోట్ల హైర్స్ కన్ఫాం అవ్వగా నైజాం లో 1.5 కోట్ల హైర్స్ అలాగే కర్ణాటక లో 2.15 కోట్ల హైర్స్ చర్చలు జరుగుతున్నాయి. అవి కన్ఫాం అయితే మొదటి రోజు…

సినిమా కి మంచి హైర్స్ దక్కే అవకాశం ఉంటుంది, రీసెంట్ బిగ్గీ సాహో కి ఫస్ట్ డే 7.25 కోట్ల హైర్స్ దక్కాయి. మరి ఫైనల్ గా డే 1 సమయానికి సైరా నరసింహా రెడ్డి సినిమా కి ఎంతవరకు హైర్స్ మొత్తం మీద సొంతం అవుతాయో చూడాలి. హైర్స్ పెద్దగా లేకున్నా కానీ సినిమా ఫస్ట్ డే సెన్సేషనల్ ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here