టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఓపెనింగ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల లో సొంతం చేసు కుంది, సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నైజాం ఏరియా లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
కాగా మొదటి రోజు నైజాం ఏరియాలో సైరా నరసింహా రెడ్డి సినిమా ఏకంగా 8.10 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇది టాలీవుడ్ చరిత్ర లోనే ఆల్ టైం టాప్ 3 బిగ్గెస్ట్ ఫస్ట్ డే షేర్ ని వసూల్ చేసిన సినిమా గా చెప్పుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి సాధించిన కలెక్షన్స్ అల్టిమేట్ అనే చెప్పాలి.
మొదటి రోజు కి ముందు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అవ్వడం మల్టీ ప్లేక్సులలో కూడా బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వడం తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అని అందరు టెన్షన్ పడ్డా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఏకంగా 8.1 కోట్ల షేర్ ని…
ఇక్కడ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. కాగా ఈ షేర్ లో 1.5 కోట్ల రేంజ్ లో హైర్స్ యాడ్ అయ్యాయని టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అప్ డేట్ వచ్చే సమయానికి క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.
అక్కడ ఇది వరకు సాహో సినిమా 9.41 కోట్ల షేర్ ని బాహుబలి పార్ట్ 2 8.9 కోట్ల షేర్ ని అందుకుని టాప్ 2 ప్లేసులలో నిలిచాయి. ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి 8.1 కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని కన్ఫాం చేసుకుంది, ఇక మిగిలిన ఏరియాల టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.