Home గాసిప్స్ సైరా కి హిందీ లో అన్యాయం…కారణం ఇదే!!

సైరా కి హిందీ లో అన్యాయం…కారణం ఇదే!!

0

      సౌత్ సినిమాలు ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు గా మారుతున్న సమయం ఇది, మన హీరోలు ఇక్కడ రిలీజ్ టైం లో ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చినా అభిమానులు సామాన్య ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వెళ్లి చూస్తారు, కానీ బాలీవుడ్ లో ఎంత విస్తృతంగా ప్రమోట్ చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అమీర్ ఖాన్ లాంటి కంటెంట్ ఉన్న సూపర్ స్టార్లు, సల్మాన్ లాంటి మాస్ సూపర్ స్టార్లు కూడా…

తమ సినిమాల రిలీజ్ కి ముందు నెల నుండే ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటారు. ఇక మన సౌత్ పాన్ ఇండియా మూవీస్ నే చూసుకుంటే బాహుబలి కి అద్బుతమైన క్రేజ్ ఉన్నా స్టార్స్ అందరు ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు సినిమా ను, ఇక వేరే ఇండస్ట్రీ ల నుండి అక్కడ కి వెళ్ళిన…

రోబో 2.0 లో అక్షయ్ సినిమా ను అన్ని చోట్లా ప్రమోట్ చేశాడు. ఇక KGF సినిమా కోసం యష్ ఏకంగా నెల రోజులు అక్కడే ఉండి ప్రమోట్ చేశాడు. ఇక సాహో రిలీజ్ సమయం లో ప్రభాస్ ఇండియా మొత్తం చుట్టేసి ప్రమోట్ చేశాడు. ఫలితం ఆ సినిమాలు అన్ని అక్కడ సాలిడ్ వసూళ్ళ ని సాధించడమే.

కానీ సైరా విషయం లో అంత బడ్జెట్ పెట్టి అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండీ, మెగాస్టార్ అమితాబ్ కూడా ఉన్నా కేవలం నామ మాత్రానికి అక్కడ వెళ్లి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి యూనిట్ తిరిగి వచ్చేసింది. ఇక్కడ ప్రమోట్ చేయక పోయినా ఆడియన్స్ ఎలాగూ థియేటర్స్ కి వెళతారు…

అక్కడే మరింత సమయం కేటాయించి సినిమాను ప్రమోట్ చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఫైనల్ గా రిజల్ట్ మొత్తం తేడా కొట్టే పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ అయ్యి 4 రోజుల అయిన సైరా సినిమా హిందీ లో టోటల్ గా 6 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.

పోటి లో వార్ సినిమా ఎంత ఎఫెక్ట్ చూపినా కానీ సైరా కి బాలీవుడ్ ట్రేడ్ మొత్తం అద్బుతమైన రివ్యూ లను ఇచ్చారు. కానీ జనాలకు అది రీచ్ కాలేదు. రీచ్ అయ్యే సరికి థియేటర్స్ కి వెళ్ళినా జనాలు లేక షోలు కాన్సిల్ అయ్యాయట చాలా చోట్లా… దాంతో అక్కడ సినిమాకి భారీ గా…

Sye Raa 3 Days Total WW Collections Report!!

అన్యాయం జరిగింది అనడం లో ఎలాంటి సందేహం లేదు, సినిమా హిందీ వర్షన్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనాలు లేరు అని టోటల్ సంఖ్యని అంతకంతకు తగ్గించేసి వార్ సినిమా కి కొత్త సినిమాలకు థియేటర్స్ ని…..

కేటాయిస్తున్నారు…. దాంతో ఆ ఎఫెక్ట్ కూడా సైరా కలెక్షన్స్ పై భారీ గా పడింది. రీసెంట్ టైం లో సైరా కి వచ్చిన యునానిమస్ టాక్ మరే పెద్ద సినిమా విషయం లో కూడా రాలేదు. ఆ అడ్వాంటేజ్ ముందే తెలిసి అక్కడ సినిమా ను బాగా ప్రమోట్ చేసి ఉంటె ఈ పాటికే సినిమా అక్కడ పోటి లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని…

అందుకుంటూ దూసుకు పోయేది…. కానీ అలా జరగలేదు సరికదా టీవీ లలో ప్రోమోలు కూడా సరిగ్గా వేయడం లేదట. మొత్తం మీద సైరా సినిమా కి అక్కడ సినిమాను కొన్న ఎక్సెల్ టీం అలాగే ప్రమోషన్ చేయని యూనిట్ కలెక్షన్స్ పరంగా భారీ గా ఎదురుదెబ్బ కొట్టింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Sye Raa 3rd Day Box Office Collections - Good Trend Again

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here