టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి దసరా బరిలో నిలిచి సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని సెలవుల్లో దుమ్ము లేపినా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకున్న అంచనాలను అందుకోవడం లో విఫలం అయిన సినిమా ఇప్పుడు ఒక్కో ఏరియా లో పరుగు ను పూర్తీ చేసు కుంటూ వెళుతుంది, సినిమా ముందుగా హిందీ లో పరుగును సైరా కంప్లీట్ చేసుకుంది.
హిందీ లో సినిమాను సుమారు 25 కోట్ల రేటు బిజినెస్ చేసింది, అక్కడ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ వారు సినిమా ను రిలీజ్ చేశారు. ఓన్ గా రిలీజ్ చేశాం అని చెబుతున్నా 3rd పార్టీ బయర్స్ ద్వారా రిలీజ్ చేయడం తో ఆ బిజినెస్ కౌంట్ లోకే వస్తుంది..
ఇక సినిమా రన్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
Business 25C(Break Even- 45C~Net)
?Total Hindi Net: 9.85C~(Share: 4.72c)
?Hindi+ROI Net: 11.35C~
?Total share- 5.42C
?Loss: 19.58C ఇదీ ఓవరాల్ గా సైరా నరసింహా రెడ్డి బాలీవుడ్ లో పరుగు పూర్తీ అయ్యే సరికి ఉన్న పొజిషన్…
సినిమా ఇంతలా అక్కడ డిసాస్టర్ అవ్వడానికి ముఖ్య కారణం నిర్మాతలు మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయక పోవడం అని చెప్పాలి, అసలు జనాలకు మా సినిమా వస్తుందని చెప్పక పొతే అక్కడ ఖాన్స్ మూవీస్ ని కూడా చూడరు. అలాంటిది వేరే భాష సినిమాలను ఎలా చూస్తారు అనుకున్నారో… అలాగే సినిమా కి మంచి రివ్యూ లు వచ్చాక అయినా ప్రమోషన్ చేసి
ఉన్నా పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది, కానీ అప్పుడు కూడా మినిమమ్ ప్రమోషన్ చేయలేదు దాని ప్రభావమే ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకున్నా అక్కడ ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోవడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
What is Telugu states 24 days share of syeraa.