మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే, సినిమా టోటల్ గా 115 కోట్ల కి పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 188 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు పార్శియల్ హాలిడే ఉండటం తో మరోసారి రెచ్చి పోయిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మెయిన్ సెంటర్స్ లో ఓ రేంజ్ లో గ్రోత్ ని చూపి సంచలనం సృష్టించింది. కాగా ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉండగా సినిమా…
ఈ రోజు అవలీలగా ఇప్పుడు 5 కోట్ల కి పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. దాంతో ఆ కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో మినిమమ్ 120 కోట్ల కి పైగా షేర్ ని….
టోటల్ వరల్డ్ వైడ్ గా 198 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేస్తుంది. దాంతో 200 కోట్ల హిస్టారికల్ గ్రాస్ మార్క్ కి కొద్ది దూరంలో 8 రోజుల వసూళ్లు ఉండనున్నాయి. ఆ మార్క్ ని 9 వ రోజు మార్నింగ్ షోల సమయానికి సినిమా అందుకుంటుంది. దాంతో టాలీవుడ్ హిస్టరీలో 200 కోట్ల మార్క్ ని అందుకున్న మూడో హీరోగా మెగాస్టార్ నిలవనున్నాడు.
ఇది వరకు ప్రభాస్ అలాగే రామ్ చరణ్ లు ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు అఫీషియల్ గా మెగాస్టార్ మూడో హీరో గా 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్నాడు. ఇక సైరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాంలు సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు.