బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి మరో ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి సినిమాలకు మాత్రమె సొంతం అయిన రికార్డ్ ను అందుకుని మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏంటో మరోసారి చాటి చెప్పాడు. టాలీవుడ్ స్టార్ హీరోల కి ఇప్పటికీ 100 కోట్ల టార్గెట్ కంప్లీట్ కాలేదు… అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల లోనే…
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి 100 కోట్ల షేర్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 98.24 కోట్ల షేర్ మార్క్ అందుకోగా 12 వ రోజున సాధించే కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని సినిమా పూర్తీ చేసుకోనుంది.
ఈ రోజు సినిమా ఊపు చూస్తుంటే 3 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండటం తో మొత్తం మీద 12 రోజుల కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 101 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల లోనే సొంతం చేసుకోబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బాహుబలి పార్ట్ 2… 204 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా…
రెండో ప్లేస్ లో బాహుబలి మొదటి పార్ట్ 114 కోట్ల షేర్ తో నిలిచింది, తర్వాత మరే సినిమా కూడా చరిత్రలో 100 షేర్ ని అందుకోలేదు, రంగస్థలం ఈ రికార్డ్ కి చేరువగా వచ్చినా 95 కోట్ల రేంజ్ దగ్గర ఆగిపోయింది, కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మెగా సెన్సేషనల్ మూవీ అయినా…
సైరా నరసింహా రెడ్డి మాత్రం ఏకంగా 100 కోట్ల షేర్ మార్క్ ని 12 రోజుల్లో అందుకుని దూసుకు పోతుండగా మరో వారం 10 రోజుల పాటు పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేవు కాబట్టి సినిమా కి బాహుబలి మొదటి పార్ట్ నెలకొల్పిన 114 కోట్ల షేర్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి.