టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 20 రోజులు పూర్తీ చేసుకోగా ఓవరాల్ గా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 140.7 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 20 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా 105.83 కోట్ల షేర్ ని ఇప్పటి వరకు సాధించి పరుగును కొనసాగిస్తుంది.
సినిమా ఓవరాల్ గా 20 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాలు రెండే రెండు, ఒకటి నైజాం మరోటి వైజాగ్… సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కి మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక సినిమా ఇప్పుడు మేజర్ మార్కెట్ అయిన రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కి….
ఆల్ మోస్ట్ క్లోజ్ గా వస్తుండగా పరుగు కూడా చివరి స్టేజ్ కి దగ్గర పడుతుంది అని చెప్పొచ్చు. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఓవరాల్ బిజినెస్ 106.8 కోట్లకు జరిగింది, బ్రేక్ ఈవెన్ కి సినిమా 107.5 కోట్ల దాకా షేర్ ని మినిమమ్ వసూల్ చేయాల్సి ఉంటుంది… కాగా 20 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా టోటల్ గా…
105.83 కోట్ల షేర్ ని అందుకోవడం తో మరో కోటి వసూల్ చేస్తే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా బిజినెస్ ని క్రాస్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. అది సినిమా ముందు ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాకున్నా కానీ..
రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ రికవరీ చేయడం ఒకింత మంచి విషయం అనే చెప్పాలి. కానీ కంప్లీట్ బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 1.7 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత లేదన్నా మరో వారం రోజుల పాటు సినిమా స్టడీ కలెక్షన్స్ తో రన్ అయితేనే ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.