Home న్యూస్ సైరా నరసింహా రెడ్డి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా!!

సైరా నరసింహా రెడ్డి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా ఫట్టా!!

0

2019 ది మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా నరసింహా రెడ్డి ఎట్టకేలకు ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 187.25 కోట్ల బిజినెస్ ను 4630 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ఇతర దేశాల్లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుంది. అక్కడ నుండి సినిమా కి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ట్రైలర్ లో చెప్పిందే అని అంటున్నారు. బ్రిటిష్ వారు ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత జనాలను ఎలా దోచుకున్నారు, వారిని అడ్డుకున్న మొదటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎలా జనాల్లో చైతన్యం కల్పించాడో.. నరసింహా రెడ్డి ని అడ్డుకునేందుకు….

బ్రిటిష్ వారు ఏం చేశారు అన్నది ఓవరాల్ గా స్టొరీ అంటున్నారు. ఇక పెర్ఫార్మెన్స్ విషయం లో మెగాస్టార్ సినిమాకి హార్ట్ అండ్ సోల్ అని అంటున్నారు. లుక్ అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టినా తర్వాత మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ డైలాగ్స్ అన్నీ విజిల్ వర్తీ గా ఉన్నాయని అంటున్నారు.

మిగిలిన పాత్రల్లో చేసిన అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ఆకట్టుకోగా హీరోయిన్స్ నయనతార మరియు తమన్నా లకు కూడా మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ దొరికిందని వారూ కూడా ఆకట్టుకున్నారని అంటున్నారు.

ఇక మ్యూజిక్ పరంగా టైటిల్ సాంగ్ దుమ్ము లేపినా మిగిలిన ఒకటి రెండు పాటలు యావరేజ్ గా ఉన్నాయని, కానీ అమిత్ త్రివేది అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉందని అంటున్నారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం మరింత షార్ప్ గా ఉండాల్సింది అంటున్నారు.

లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ స్లో నరేషన్ కొంచం ఇబ్బంది పెట్టాయని, అవి తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏవి లేవని అంటున్నారు. ఇక నిర్మాతగా రామ్ చరణ్ పెట్టిన ప్రతీ పైసా విజువల్ గ్రాండియర్ గా అద్బుతంగా అనిపించిందని, గ్రాఫిక్స్ కానీ లోకేషన్స్ కానీ గ్రాండియర్ కానీ టాలీవుడ్ ప్రైడ్ బాహుబలి కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని అంటున్నారు.

ఇక డైరెక్షన్ పరంగా సురేందర్ రెడ్డి అద్బుతంగా టేక్ చేసి సినిమాను అంచనాలను అందుకునేలా చేశాడని, యాక్షన్ సీన్స్ ని అద్బుతంగా డైరక్ట్ చేశాడని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా లో ముందు చెప్పిన ఒకటి 2 చిన్న మైనస్ పాయింట్స్ తప్పితే…

ఆద్యంతం అంచనాలను తగ్గట్లు సినిమా ఉందని అంటున్నారు. వారి నుండి ఫైనల్ గా సినిమా కి వినిపిస్తున్న టాక్ హిట్ నుండి సూపర్ హిట్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉందని చెప్పాలి. ముఖ్యంగా గ్రాండియర్, యాక్షన్ సీన్స్, హీరోయిజం అండ్ ఎమోషనల్ సీన్స్ ని…

చాలా బాగా ఆకట్టుకునేలా తీశారని అంటున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సూపర్ హిట్ కి తగ్గని టాక్ ని సొంతం చేసుకున్న సైరా సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ రాంపేజ్ దసరా వరకు ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here