Home గాసిప్స్ రీసెంట్ టైం లో ఇలాంటి షాక్…మరే పెద్ద సినిమాకి రాలేదు!!

రీసెంట్ టైం లో ఇలాంటి షాక్…మరే పెద్ద సినిమాకి రాలేదు!!

9333
0

      టాలీవుడ్ లో చిన్న మీడియం రేంజ్ సినిమాలకు రిలీజ్ సమయం లో కొన్ని అడ్డంకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ పెద్ద సినిమాల విషయం లో రిలీజ్ కి ముందు ఎలాంటి అడ్డంకులు రాకుండా సాఫీ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలకు టైటిల్ గొడవలు అయ్యాయి కానీ రిలీజ్ విషయం లో ఎలాంటి డోకా లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి…

విషయం లో భారీ తప్పులు జరుగుతున్నాయి… నిర్మాతలు సినిమా ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు నాలుగు చోట్లకు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చారు.. అది పెద్దగా ప్రభావం అయితే చూపలేదు. కానీ కనీసం రిలీజ్ అయిన పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారా అంటే…

అది మరింత షాక్ ఇస్తుంది. టాలీవుడ్ హిస్టరీ లోనే రీసెంట్ టైం లో మల్టీ ప్లేక్సులలో ఇంత పెద్ద సినిమా రిలీజ్ కి ఒక రోజు ఉంది అనగా ఓపెన్ అవ్వడం ఇదే తొలిసారి. టికెట్ రేట్ల విషయం లో, థియేటర్స్ కి ఇవ్వాల్సిన పెర్సేంటేజ్ ఇష్యూస్ వలన ఆన్ లైన్ టికెట్ సేల్స్ అస్సలు ఓపెన్ అవ్వలేదు.

దాంతో సింగిల్ స్క్రీన్స్ అండ్ కొన్ని క్లాస్ సెంటర్స్ లో మాత్రమె సినిమా టికెట్ సేల్స్ నాలురు రోజుల ముందు ఓపెన్ అయింది. ఇక చాలా ఆలస్యంగా రిలీజ్ కు ముందు రోజు అంటే ఇవాళ ఉదయం నుండి మెల్లి మెల్లిగా అన్ని మల్టీ ప్లేక్సులలో బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి.

దాంతో ఇప్పుడు ఆ ప్రభావం తొలిరోజు కలెక్షన్స్ పై పడే అవకాశం ఉంది, ఈ ఎఫెక్ట్ ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు టోటల్ ఇండియా లో ఎఫెక్ట్ అయింది. నార్త్ ఆడియన్స్ లో చాలామందికి రిలీజ్ అనే తెలియని పరిస్థితి దానికి తోడూ చాలా లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వడం… ఇవన్నీ షాక్ ల మీద షాక్ లు అనే చెప్పాలి.

ఇవన్నీ పక్కకు పెడితే ఖైదీ నంబర్ 150 తో భారీ పోటిలో కూడా రికార్డులు తిరగరాశాడు మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదురు అవుతున్నా తొలిరోజు రికార్డుల విషయం లో కూడా మళ్ళీ జోరు చూపించాలని అందరు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here