ఇండస్ట్రీ షాక్..నైజాంలో సైరాకి బిజినెస్ లెక్క ఇది….GSTతో ఊచకోత!

0
478

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, ఏకంగా 104 కోట్ల షేర్ తో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి. అత్యంత భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.

టాలీవుడ్ చరిత్రలో నాన్ బాహుబలి మూవీస్ లో ఈ సినిమా క్రేజ్ మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు. అలాంటి సినిమా అవ్వడం వలనే సినిమా కి ననైజాం ఏరియా నుండి లీడింగ్ ప్రొడ్యూసర్స్ నుండి అత్యంత భారీ ఆఫర్స్ వస్తున్నాయట… సినిమా కి గాను ఏకంగా 30 కోట్ల ఆఫర్ లేటెస్ట్ గా వచ్చిందని సమాచారం…

అది కూడా GST తో కలిపి అవ్వడంతో ఇప్పుడు ఆఫర్ చూసి టోటల్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫర్ కనుక ఓకే అయితే తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం నాన్ బాహుబలి ఆఫర్ గా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!