T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

సైరా సీడెడ్ బిజినెస్…సెన్సేషన్ రికార్డ్!!



    మైటీ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడానికి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా టీసర్ 2 సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి. టేకింగ్, విజువల్స్, మెగాస్టార్ హీరోయిజం ఇలా టీసర్ లో అన్నీ హైలెట్ అయ్యాయి. ఇక సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జోరు అందుకుంది.

10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తోనే ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన మెగాస్టార్ అన్ని ఏరియాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించాడు, సీడెడ్ లో ఏకంగా 15 కోట్ల దాకా షేర్ ని అందుకున్నాడు. ఆ జోరు చూసే ఇప్పుడు సైరా సినిమా కి…

రాయలసీమ ఏరియాలో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ జరిగిందని సమాచారం, ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కి అక్కడ 20 కోట్ల నుండి 22 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం, ఇది అక్కడ బాహుబలి 2, లేటెస్ట్ సాహో తర్వాత మూడో హైయెస్ట్ బిజినెస్…

మెగాస్టార్ స్టామినా కి ఏమాత్రం తక్కువ కానీ విధంగా సినిమా బిజినెస్ ఇప్పుడు జరగడం తో సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, ఎలాగు సినిమాలో పెద్దగా కమర్షియల్ హంగులు ఉండవు, సీరియస్ పీరియాడికల్ కథ కాబట్టి… యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయితే

బాక్స్ ఆఫీస్ ఊచకోత కోయడం మాత్రం పక్కా అంటున్నారు. మరి సినిమా ఎంతవరకు ఈ అంచనాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మమ్మోత్ టార్గెట్ ని అందుకోగలుగుతుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE