చస్…మరో ఇండస్ట్రీ రికార్డ్… మెగాస్టారా…మజాకా!!!

     మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే, ఈ ఇయర్ మోస్ట్ వాంటెడ్ సినిమా లలో ఒకటిగా నిలిచిన ఈ మమ్మోత్ మూవీ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా సినిమా ఒక్కో ఏరియా లో బిజినెస్ ని కంప్లీట్ చేసుకుంటూ దూసుకు పోతుంది. ఈ క్రమం లో సినిమా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డులు నమోదు చేసింది.

ఇక ఇప్పుడు ఆంధ్రా లో మెయిన్ సెంటర్స్ లో ముఖ్యమైన గోదావరి జిల్లాలకు గాను ఈ సినిమా బిజినెస్ పరంగా ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది. బాహుబలి, సాహో ల పేరిట ఉన్న రికార్డులను తుడిచి పెట్టి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.

అక్కడ టాప్ 3 బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను సాధించిన టాప్ 3 టాలీవుడ్ మూవీస్ ని గమనిస్తే..
1)#SyeRaaNarasimhaReddy-19.6 Cr
2)#Saaho – 19.5 Cr
3)#Baahubali2 -18 Cr
బాహుబలి రికార్డ్ ను సాహో బ్రేక్ చేస్తే, సాహో రికార్డ్ ను సైరా బ్రేక్ చేసి సంచలనం సృష్టించి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

మిగిలిన ఏరియాల్లో కూడా సినిమా బిజినెస్ సాలిడ్ గా సాగుతున్నట్లు సమాచారం. అన్ని ఏరియాల ఫైనల్ కౌంట్ కొన్ని రోజుల్లో అఫీషియల్ గా రిలీజ్ అవుతుందట. ట్రేడ్ లో వినిపిస్తున్న కౌంట్ ప్రకారం వరల్డ్ వైడ్ బిజినెస్ 190 కోట్లకు పైగా జరుగుతుందని అంటున్నారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని, పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమా సాధించే కలెక్షన్స్ రికార్డులు మరో రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఇన్ని అంచనాలను ఎంతవరకు నిజం చేస్తుందో అక్టోబర్ 2 తేలనుంది అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE