టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్ 150 తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే, కాగా సినిమా షూటింగ్ రెండేళ్ళ నుండి కొనసాగుతుండగా ఇప్పుడు ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి వచ్చేసింది, డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్లో గా సినిమాలను తీస్తాడు అన్న పేరు ని మరోసారి నిజం చేసుకున్నా ఈ సారి బడ్జెట్ అండ్ మార్కెట్ దృశ్యా పక్కా క్వాలిటీ తో రావాలి అని ఫిక్స్ అయ్యాడు.
ఇక సినిమా ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ చేసుకోవడం తో ఫైనల్ రన్ టైం కోసం సినిమా రఫ్ కట్ ఎంత వచ్చిందా అని చూసుకున్న యూనిట్ కి ఒకింత షాక్ తగిలిందట. ఏకంగా 3 గంటల 46 నిమిషాల ఫుటేజ్ వచ్చిందని సమాచారం. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం…
2 గంటల 50 నిమిషాల లెంత్ మాగ్జిమం హైయెస్ట్ కాగా కొన్ని సినిమాలు 3 గంటలను టచ్ చేసినా సినిమాలో సత్తా ఉంటే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. అలా చూసుకున్నా రఫ్ కట్ ఏకంగా 3 గంటల 46 నిమిషాల లెంత్ ఉండటం తో ఇప్పుడు ఆ రఫ్ కట్ నుండి…
ఎంతవరకు ఎడిట్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది, మెగాస్టార్ ఆ రఫ్ కట్ చూసి మొదట్లో కొంచం చిరాకు కూడా పడినట్లు టాక్ వినిపించింది, అంత లెంత్ ఎలా వచ్చిందని, ఇప్పుడు సీన్స్ ని కట్ చేస్తూ పొతే సినిమా ఫీల్ మిస్ అవుతుందేమో అన్న డౌట్ లు కూడా ఉన్నాయట.
దాంతో మెగాస్టార్ చిరంజీవే స్వయంగా ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుని తనకున్న ఎక్స్ పీరియన్స్ తో ఏ సీన్స్ ఉంచాలి ఏవి తీయాలి అన్నది డిసైడ్ చేస్తారని టాక్, మరి ఫైనల్ గా అప్పటికి రన్ టైం ఎంతవరకు వెళుతుంది అనేది ఆసక్తిగా మారుతుందని చెప్పొచ్చు. సినిమా అక్టోబర్ 2 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వాడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.