Home న్యూస్ లక్ష రికార్డ్ లో 6….2 లక్షల రికార్డ్ లో 3…మెగాస్టార్ పేరుకున్న పవర్ ఇది!!

లక్ష రికార్డ్ లో 6….2 లక్షల రికార్డ్ లో 3…మెగాస్టార్ పేరుకున్న పవర్ ఇది!!

842
0

     టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ 2 రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డుల వేట ని మొదలు పెట్టింది, మొదటగా సినిమా టీసర్ కి యునానిమస్ రెస్పాన్స్ అన్ని చోట్లా దక్కుతుందని చేపోచ్చు. తెలుగు లో దుమ్ము లేపుతున్న ఈ టీసర్ కి హిందీ లో కూడా మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. కన్నడ లో కూడా భారీ వ్యూస్ వస్తున్నాయి.

ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి సినిమా టీసర్ ఇప్పటికే 18 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఇక ఫాస్టెస్ట్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల లైక్స్ విషయం లో కూడా సైరా సినిమా తన క్రేజ్ ఏంటో చాటుకుందని చెప్పొచ్చు.

ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయం లో మాత్రం రిలీజ్ సమయానికి ముందే రిలీజ్ చేయడం తో కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడగా సినిమా 44 నిమిషాలకు పైగా టైం తీసుకుని 1 లక్ష లైక్స్ ని కంప్లీట్ చేసింది. టాప్ ప్లేస్ లో సాహో 23 నిమిషాలకు పైగా టైం తో టాప్ లో ఉంది.

ఇక 2 లక్షల లైక్స్ విషయం లో సైరా టీసర్ ఒక గంటా 35 నిమిషాల టైం తీసుకుని ఈ రికార్డ్ ను అందుకోగా టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది, మొదటి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 80 నిమిషాల టైం లో ఈ రికార్డ్ ను అందుకుంది. ఇక 3 లక్షల లైక్స్ విషయానికి వస్తే…

7 గంటల 7 నిమిషాల టైం లో ఈ రికార్డ్ ను అందుకుని టాప్ 3 ప్లేసు ను అందుకుంది, టాప్ లో అజ్ఞాతవాసి 4 గంటల 32 నిమిషాలతో టాప్ లో ఉంది, మొత్తం మీద సీనియర్ హీరోల్లో ఇలాంటి రికార్డులు నమోదు చేసిన వన్ అండ్ ఓన్లీ గా మెగాస్టార్ టాప్ లో నిలవగా నేటి క్రేజీ స్టార్స్ తో పోటి పడి టాప్ ప్లేసులను సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here