Home న్యూస్ గంటలో మెగా సునామీ…కాచుకోండి!!

గంటలో మెగా సునామీ…కాచుకోండి!!

807
0

     ఖైదీనంబర్ 150 లాంటి సెన్సేషనల్ కంబ్యాక్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఏకంగా రెండున్నర ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా సైరా నరసింహా రెడ్డి, రెండేళ్ళ క్రితం మోషన్ పోస్టర్ మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా గత ఏడాది సినిమా ఫస్ట్ టీసర్ ను రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. చిరు లుక్స్ పై కొంచం నెగటివ్ ఇంప్రెషన్ వచ్చినా సినిమా టీసర్ రెస్పాన్స్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు.

 ఇక ఇప్పుడు సినిమా లోని మరో టీసర్ ను ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కి రెండు రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు సినిమా అఫీషియల్ టీసర్ 2 ని అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

కాగా ఈ టీసర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం తో మరింత క్రేజ్ టీసర్ పై ఏర్పడింది అని చెప్పాలి. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమా కోసం తన గొంతు సవరించుకుని సైరా అంటూ చెప్పిన డబ్బింగ్ గ్లిమ్స్ ఇప్పటికే హైలెట్ అయింది.

ఇక ఈ సెన్సేషనల్ టీసర్ యూట్యూబ్ లో సునామీ సృష్టించడానికి సిద్ధం అవుతుండగా తొలి 24 గంటల్లో ఈ టీసర్ కొన్ని రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉంటుంది, అందులో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ సాహో టీసర్ 12.94 మిలియన్ వ్యూస్ తో సొంతం చేసుకుంది.

ఇక హైయెస్ట్ లైక్స్ కూడా సాహో టీసర్ 4 లక్షల 55 వేల లైక్స్ తో టాప్ లో ఉంది, మరి ఇప్పుడు మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి టీసర్ 24 గంటలు ముగిసే లోపు ఈ రికార్డుల బెండు తీసి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here