Home న్యూస్ 4 నిమిషాల్లో ఇండియా…16 నిమిషాల్లో వరల్డ్ వైడ్…మెగాస్టారా…మజాకా!!

4 నిమిషాల్లో ఇండియా…16 నిమిషాల్లో వరల్డ్ వైడ్…మెగాస్టారా…మజాకా!!

1610
0

     10 ఏళ్ళు వెండి తెరకు దూరంగా ఉన్నా తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఖైదీ నంబర్ 150 తో ఋజువు చేస్తున్నాడు, ఇక ఆ తర్వాత రెండున్నర ఏళ్లుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ ఈ ఇయర్ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా మెగాస్టార్ బర్త్ డే కి 2 రోజుల ముందే రిలీజ్ చేసిన అఫీషియల్ టీసర్ 2…

ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది. కాగా సీనియర్ హీరోల్లో తన స్పెషాలిటీ ని మరోసారి చాటుకుంటూ ఇలా టీసర్ రిలీజ్ అయ్యిందో లేదో నేషనల్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ట్రెండ్ అవుతూ సైరా టీసర్ దుమ్ము దులిపేస్తూ దూసుకు పోతుంది.

కాగా టీసర్ రిలీజ్ అయిన 4 వ నిమిషం లోనే ఇండియా వైడ్ గా టాప్ 3 ప్లేసు లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టగా వరల్డ్ వైడ్ గా 16 నిమిషం లోనే టాప్ 18 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. గంట లోపే ఏకంగా 1 లక్షా 20 వేల కి పైగా ట్వీట్స్ పోల్ అయ్యాయి.

ఇలా సోషల్ మీడియా లో మెగాస్టార్ వీరంగం కొనసాగగా ప్రస్తుతానికి ఇండియా లో టాప్ 2 ప్లేసులలో నిలిచిన హాష్ టాగ్స్ కూడా సైరా వె అవ్వడం విశేషం అని చెప్పొచ్చు. ఇక టీసర్ యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దూసుకు పోతుందని చెప్పాలి.

మొత్తం మీద ఇప్పుడు 24 గంటలు ముగిసే సరికి ఎలాంటి రికార్డులను ఈ సినిమా టీసర్ నెలకొల్పుతుందా అనేది ఆసక్తిగా మారింది, ఇక అంచనాలు భారీ ఎత్తున పెరిగి పోవడం తో అక్టోబర్ 2 న బాక్స్ ఆఫీస్ దిమ్మతిరిగే రికార్డులతో సైరా దుమ్ము లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here