టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా మమ్మోత్ మూవీ సైరా నరసింహా రెడ్డి లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ మూవీస్ లో ఒకటి. అక్టోబర్ 2 న రిలీజ్ అయిన సినిమా అల్ట్రా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఇతర భాషల్లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ లేక పోవడం పేట్రియాటిక్ నేపధ్యం లో వచ్చిన మూవీస్ సరైన సక్సెస్ అందుకొక పోవడం లాంటి అడ్డంకుల వలన సక్సెస్ కాలేకపోయింది.
తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లు వచ్చినా ఓవరాల్ గా బిజినెస్ ని అందుకోలేక ఫ్లాఫ్ అయింది. ఇక సినిమా ను జెమినీ టీవీ వారు ఏకంగా 25 కోట్లకు కొనగా టెలికాస్ట్ త్వరగా చేస్తారు అనుకుంటే చాలా ఆలస్యం చేశారు. ఇంతలో సినిమా ఒరిజినల్ ప్రింట్ వచ్చేయడం…
ఇతర భాషల్లో కూడా టెలికాస్ట్ అవ్వడం లాంటివి జరిగి పోయాయి. సినిమా ముందుగా తమిళ్ డబ్ టెలికాస్ట్ అవ్వగా అక్కడ సినిమా కి 15.44 TRP రేటింగ్ దక్కింది. ఇది అక్కడ తెలుగు డబ్ మూవీస్ లో రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ అని చెప్పాలి. ఇక తర్వాత కన్నడ డబ్ టెలికాస్ట్ అయింది.
అక్కడ సినిమా కి 6.3 TRP రేటింగ్ దక్కింది. ఇక తెలుగు లో ఆలస్యంగా సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ చేయగా సినిమా కి 11.8 TRP రేటింగ్ మాత్రమె దక్కింది. ఇది డీసెంట్ TRP రేటింగ్ నే అయినా సినిమా రేంజ్ కి మెగాస్టార్ క్రేజ్ కి ఇది చాలా తక్కువ TRP రేటింగ్ అనే చెప్పాలి.
దీనికి క్రెడిట్ మొత్తం జెమినీ టీవీ కే వెళుతుంది, టెలికాస్ట్ చాలా ఆలస్యం చేయడం వలన తక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా కి వాళ్ళు పెట్టిన 25 కోట్ల రేటు గిట్టుబాటు అవ్వాలి అంటే సినిమా మరిన్ని సార్లు టెలికాస్ట్ అయితే తప్పితేనే ఛానెల్ కి లాభాలు దక్కే అవకాశం ఉంటుంది. ఇక మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీ పనుల్లో బిజీ గా ఉన్నారు…