తమిళ్ సినిమాల పరంగా ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన సినిమాలు ఊహకందని రాంపెజ్ ను చూపించేవి కానీ తర్వాత టైంలో తమిళ్ మార్కెట్ ను సింగిల్ హ్యాండ్ గా ఏలుతున్న రికార్డ్ మాత్రం దళపతి విజయ్(Thalapthy Vijay) కే చెల్లుతుంది అని చెప్పాలి. మిగిలిన స్టార్స్ ఓపెనింగ్స్ ను..
అందుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ రికార్డ్ లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్న విజయ్ ను అందుకోవడానికి ఇతర హీరోలు ఇప్పుడు చూపించిన జోరు కన్నా కూడా…
ఇంకా సూపర్ సాలిడ్ స్పీడ్ ను క్రేజ్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయ్ తర్వాత తల అజిత్ కుమార్(Ajith Kumar) కి కూడా సాలిడ్ క్రేజ్ ఉన్నా కూడా ఇంకా విజయ్ ను అయితే దాటే రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ ను అందుకోలేక పోతున్నాడు.
కానీ ఉన్నంతలో మరీ సాలిడ్ హైప్ ను క్రియేట్ చేసే రేంజ్ మూవీస్ ను ఎంచుకోలేక పోతున్నా కూడా తను చేస్తున్న ఎక్స్ పెరిమెంట్స్ తోనే సాలిడ్ ఓపెనింగ్స్ ను అయితే అందుకుంటూ ఉన్నాడని చెప్పాలి. ఒకసారి తమిళనాడులో మొదటి రోజున…
ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
Tamilnadu all time Top Day 1 Highest Grossing Movies
👉#Beast: 36.80CR
👉#LEO: 35.45CR
👉#Sarkar: 32CR
👉#TheGreatestOfAllTime – 31.65CR
👉#Valimai: 28.90CR
👉#GoodBadUgly —28.35Cr********
👉#PonniyanSelvan1: 26.85CR
👉#BIGIL: 26.50CR
👉#VidaaMuyarchi-Pattudala – 26.15CR
మొత్తం మీద లిస్టులో విజయ్ సినిమాల ఊరమాస్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తూ ఉండగా, ఇప్పుడు విజయ్ సినిమాల నుండి తప్పుకుంటూ ఉండటంతో అప్ కమింగ్ టైంలో విజయ్ సినిమాల రికార్డులను ఏ హీరో అందుకుండాడో అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం అని చెప్పాలి.