రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) మూవీ భారీ లెవల్ లో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా షేర్ ని 137 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమాకి ముందు నుండి అనుకున్నట్లే రెండు చోట్లలో కూడా భారీ ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఆ రెండు చోట్లే తమిళనాడు మరియు కేరళ… టీం అక్కడ సినిమాను వెళ్లి ప్రమోట్ ఏమి చేయలేదు కానీ…
ఆల్ రెడీ అన్ని ఇండస్ట్రీలలో పరిచయం ఉన్న హీరో సినిమా వస్తుంది అంటే మినిమమ్ ఓపెనింగ్స్ ని అయితే అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారు కానీ ఆదిపురుష్ సినిమా మాత్రం ఏమాత్రం జోరుని చూపించలేదు. తమిళనాడులో తమిళ్ వర్షన్ కన్నా కూడా తెలుగు వర్షన్ అలాగే…
హిందీ వర్షన్ కి బెటర్ రెస్పాన్స్ సొంతం అయింది. దాంతో అన్ని వర్షన్ లు కలిపి తమిళ్ లో మొదటి రోజు 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా కేరళలో కూడా 60 లక్షల లోపే గ్రాస్ ను సినిమా మొదటి రోజు అందుకుంది. అన్ని చోట్లా కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే…
ఈ రెండు చోట్ల సినిమా కలెక్షన్స్ మొదటి నుండి అనుకున్నట్లే లో కలెక్షన్స్ ని సాధించి తీవ్రంగా నిరాశ పరిచాయి అనే చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో కూడా అక్కడ తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. దాంతో సినిమా ఎక్కువ కలెక్షన్స్ ని తెలుగు హిందీలోనే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.