Home న్యూస్ తెలుగు ఫస్ట్ కిక్ బాక్సింగ్ మూవీ తమ్ముడుకి 22 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

తెలుగు ఫస్ట్ కిక్ బాక్సింగ్ మూవీ తమ్ముడుకి 22 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

1658
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా నిలిచిన హీరో… ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కి కొంచం దూరం అయ్యి వకీల్ సాబ్ తో కంబ్యాక్ ఇచ్చారు కానీ ఒకప్పుడు కెరీర్ లో ఆల్ టైం పీక్ స్టేజ్ హిట్స్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశాడు పవన్ కళ్యాణ్.. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ ఇలా ఒక్కో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో అద్బుతం సృష్టించింది. ఇందులో టాలీవుడ్ లో ఫస్ట్ కిక్ బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమాగా నిలిచిన చిత్రం తమ్ముడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రతిభని రియల్ స్టంట్స్ ని ఆడియన్స్ కి పరిచయం చేసిన ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వగా మేడ్ ఇన్ ఆంద్ర స్టూడెంట్, అమ్ జస్ట్ అ ట్రావెలింగ్ సోల్జర్ లాంటి సాంగ్స్ ఇప్పటికీ వింటూ ఉంటారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్బుతమైన సక్సెస్ గా నిలిచింది.

సినిమా కి ఆ టైం లోనే 4.85 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.8 కోట్ల దాకా షేర్ ని రాబట్టి బిజినెస్ మీద ఏకంగా డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. తర్వాత ఈ సినిమా తమిళ్, కన్నడ మరియి బెంగాలి భాషల్లో రీమేక్ అయింది.

పవర్ స్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ముందు నిలిచే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు 1999 లో రాగా సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 22 ఏళ్ళు పూర్తీ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరిగి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండగా ఒకప్పటి సక్సెస్ లు తిరిగి సొంతం అయితే బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here