Home న్యూస్ తమ్ముడు ట్రైలర్ రివ్యూ….నితిన్ సాలిడ్ కంబ్యాక్ మూవీ ఇది!!

తమ్ముడు ట్రైలర్ రివ్యూ….నితిన్ సాలిడ్ కంబ్యాక్ మూవీ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 5 ఏళ్ల క్రితం భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) తర్వాత టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న నితిన్ ఈ ఇయర్ రాబిన్ హుడ్ మూవీ తో భారీ డిసాస్టర్ ను సొంతం చేసుకున్న నితిన్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తమ్ముడు(Thammudu Movie)తో జులై 4న…

గ్రాండ్ గా తన సినిమాను రిలీజ్ చేస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగి పోగా నితిన్ కి ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉండనిపించేలా ఉంది…

MCA, వకీల్ సాబ్ సినిమాల డైరెక్టర్ వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా క్వాలిటీ పరంగా ఎక్స్ లెంట్ విజువల్స్ తో మెప్పించగా కొంచం కథ పాయింట్ ని కూడా చెప్పే ప్రయత్నం చేసినా కోర్ పాయింట్ ను ఏమి రివీల్ చేయలేదు…

తనని తమ్ముడిలా ఎప్పటికీ గుర్తించని అక్క లయ, ఒక ఊరి విషయంలో ఇబ్బంది పడుతూ ఉండటంతో తన కోసం తమ్ముడు ఏం చేశాడు, ఆ ఊరి సమస్యని సాల్వ్ చేసే క్రమంలో హీరో తన అక్కకి దగ్గర అయ్యాడా లేదా అన్నది అసలు కథ పాయింట్ గా చెబుతున్నా…

ఊరిలో ఏం జరిగింది అన్నది మాత్రం ట్రైలర్ లో విజువల్స్ చూపించినా కథ గా ఏమి చెప్పకుండా సస్పెన్స్ ను కంటిన్యూ చేశారు….ఓవరాల్ గా సినిమా ట్రైలర్ విజువల్స్ కానీ నితిన్ మాస్ సీన్స్ కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ బాగా ఆకట్టుకోగా….ట్రైలర్ చూసిన తర్వాత…

సినిమా మీద అంచనాలు అయితే పెరిగి పోయాయి అనే చెప్పాలి. ట్రైలర్ ఉన్న రేంజ్ లో సినిమా కంటెంట్ మెప్పిస్తే కచ్చితంగా నితిన్ ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమాతో సొంతం అయ్యే అవకాశం ఉంది. ఇక ట్రైలర్ ఓవరాల్ గా 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here