Home TRP రేటింగ్ 65 లక్షల రేటు…రెండో సారి కూడా ఊరమాస్ TRP!!

65 లక్షల రేటు…రెండో సారి కూడా ఊరమాస్ TRP!!

1210
0

అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు ఊహించని రేంజ్ లో రేటింగ్ లు వస్తూ ఉంటాయి, అవి తెలుగు సినిమాలే కావొచ్చు లేదా డబ్బింగ్ మూవీస్ కావొచ్చు, జనాలకు ఆ టైం లో ఆ సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే ఇక ఆ సినిమా రేటింగ్ ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు, ఇలాంటి రిజల్ట్ నే వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా టెలివిజన్ లో మట్టుకు సెన్సేషనల్ రేటింగ్ లతో దుమ్ము లేపుతుంది.

రీసెంట్ గా తమిళ్ లో ఆర్య హీరోగా రూపొందిన టెడ్డి అనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ రిలీజ్ ను ఎంచుకోగా సినిమా తెలుగు లో కూడా డబ్ అయ్యి డిజిటల్ రిలీజ్ అయింది, సినిమా కి మరీ అనుకున్న రేంజ్ టాక్ ఏమి రాలేదు కానీ…

పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమాను తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్ళు 65 లక్షల రేంజ్ లో రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అందరి అంచనాలను మించే రేంజ్ లో TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది….

ఆ రేటు కి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 8.52 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక ఫస్ట్ టైమే సాలిడ్ ప్రాఫిట్స్ ను దక్కించుకున్న ఈ సినిమా రీసెంట్ గా సెకెండ్ టైం టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా అద్బుతంగా హోల్డ్ చేసిన ఈ సినిమా ఈ సారి 6.51 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఓవరాల్ గా ఇవి నార్మల్ రేటింగ్ లనే చెప్పాలి కానీ సినిమా కోసం పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది సెన్సేషనల్ రేటింగ్ లు అని చెప్పాలి… ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకోవడం తో ఛానెల్ కి సూపర్ సాలిడ్ ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టింది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించేలా ఉంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here